పిల్లలను వద్దనుకుని అవి వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

మహిళలు ఈ మధ్య పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొందరగా పిల్లలను కావాలనుకునే వారికంటే ముందు లైఫ్ లో సెట్ అయన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. అలాగే పిల్లల మధ్య ఎడం ఉండాలని లేకపోతే సమస్యలు వస్తాయని తెలుసుకుంటున్నారు. అయితే.. దీనికోసం కొంతమంది డాక్టర్ల సలహాలు తీసుకుంటున్నారు. కొందరు అలాంటి సలహాలు ఏమీ తీసుకోకుండానే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్నారు. అయితే ఇలా డాక్టర్ల సలహాలు తీసుకోకుండా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం మంచిదికాదు.

ఇలా డాక్టర్ల సలహాలు తీసుకోకుండా పిల్స్ వాడటం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని పలువురు పరిశోధకులు చెబుతున్నారు. కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆ సమస్యలను తెలుసుకుని వాటినుంచి బయటపడాల్సిన అవసరం చాలా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

ఈ బ‌ర్త్ కంట్రోల్ పిల్స్ రెగ్యుల‌ర్ గా వేసుకోవ‌డంతో శ‌రీరంలో విట‌మిన్ బి, సి, ఈ, జింక్, సెలీనియం, మెగ్నీషియం త‌గ్గుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. వాటిని స‌రిచేయాలంటే రెయిన్ బోడైట్ ఫాలో అవ్వాల‌ని సూచిస్తున్నారు. మాంసం​, పాలు, కూర‌గాయ‌లు, బ్రెడ్​, డ్రై ఫ్రూట్స్​, పండ్లు , స్వీట్స్​ వీలైనంత ఎక్కువగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. డాక్టర్​ సలహా మేరకు మల్టీవిటమిన్​ మెడిసిన్స్​ కూడా వేసుకోవ‌ల‌సి ఉంటుందని తెలుపుతున్నారు.

ఈ పిల్స్ వాడ‌టం వ‌ల్ల చాలా మంది మ‌హిళ‌ల్లో కోపం, చిరాకు, బాధ లాంటి ఎమోషన్స్ ఎక్కువగా కనిపిస్తాయట. ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ మెడిటేషన్, యోగా చేయాల‌ని సూచిస్తున్నారు. ఉదయం ఒక‌ అరగంటైనా ఎక్సర్​సైజ్​ చేయాల‌ని తెలుపుతున్నారు. అలాగే నిద్ర చాలా అవ‌స‌ర‌మ‌ని చెబుతున్నారు. 7 నుంచి 8 గంటల నిద్ర అవ‌స‌ర‌మ‌ని చెబుతున్నారు.

డాక్ట‌ర్ల‌ను క‌న్స‌ల్ట్ కాకుండా చాలా మంది పిల్స్ వాడుతున్నారని చెబుతున్నారు. వారు అవ‌గాహ‌న లోపంతో మోతాదుకి మించి పిల్స్ వేసుకుంటున్నారని, అలా చేయ‌డం వ‌ల్ల బ‌రువు అధికంగా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అలాగే ఓవర్​ డోస్​ వ‌ల్ల ప‌లు రకాల సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తాయ‌ని చెబుతున్నారు. అందుకే మెడిసిన్స్​ వేసుకునే ముందు ఒక్కసారి డాక్టర్​ని కలవాల‌ని సూచిస్తున్నారు.

హెల్త్​ని కాపాడుకోవడానికి ప్రో బయోటిక్స్​ ఎక్కువగా ఉండే పెరుగు, మజ్జిగ, ఎక్కువగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. హెల్త్​కి హాని చేసే షుగర్​, రిఫైన్డ్ ఆయిల్స్​, రిఫైన్డ్​​ కార్బో హైడ్రేట్స్​కి దూరంగా ఉండాల‌ని చెబుతున్నారు. ఈ పిల్స్​ కాలేయం పనితీరుపై కూడా ప్రభావం చూపుతాయ‌ని చెబుతున్నారు. అందుకే ఏది చేసినా డాక్ట‌ర్ల సూచ‌నల మేర‌కే చేయాల‌ని, లేక‌పోతే ప‌లు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు.