వివాహ బంధం పదిలం గా ఉండాలంటే ఇలా చేయండి!!

వైవాహిక జీవితం లో భార్య,భర్త  ల మధ్య అభిప్రాయభేదాలు అనేవి చాల సహజం.అలా వచ్చినప్పుడు సమస్య ను పరిష్కరించుకునే విధం గా ఎవరో ఒకరు చొరవ తీసుకొని వాటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కరించుకునే విధంగా ముందడుగు వేసి సమస్యని పరిష్కరించుకుంటేనే ఇద్దరి మధ్య బంధం బలంగా ఉంటుంది. లేదు అహాని కి పోయి అలాగే ఉంటే చాలా త్వరగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలుపెరిగిపోయి విడిపోయే వరకువెళ్లిపోయేపరిస్థితి రావచ్చు. ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవడం, ఒకరితో ఒకరు సంప్రదించుకొవడం, గౌరవించుకోవడం, కలసి పనులు చేసుకోవడం తో పాటు శృంగార జీవితం లో ఇద్దరి తోడ్పాటు తప్పనిసరిగా ఉండాలి. ఇలా ప్రతిదీ  సక్రమం గా ఉంటేనే భార్యాభర్తల సంసార జీవితంసంతోషంగా సాగుతుంది.

వివాహ బంధం పదిలం గా ఉండాలంటే ఇలా చేయండి!!

దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్త లుఅవసరం అన్నఅంశం పై కొందరు నిపుణులు ఇచ్చిన  సూచనలను తెలుసుకుందాం. చిన్న చిన్న విషయాల మీద కూడా శ్రద్ధ తీసుకుంటే సంసారం సంతోషం గా సాగుతుందని తెలియజేస్తున్నారు. ముందుగా ఆలుమగల  విషయం లో మాట్లాడుకోవడం అనేది చాల చాల ప్రధానమైన అంశం గా చెప్పాలి. ప్రతి విషయాన్ని ఇద్దరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే ఒకసారి ఒకరు మాట వింటే ఇంకోసారి  ఇంకొకరి మాట వినడం చేస్తే ఎలాంటి దూరం లేకుండా సంతోషం గా బ్రతికేయవచ్చు.సమస్య వచ్చినప్పుడు తొందర పడకుండా ఓర్పుగాఉండడం అనేది ఇద్దరి బంధానికి సంజీవని లాంటిది అని మర్చి పోకండి. ఒకరి తో ఒకరు పని పంచుకోవడం వలన కూడా సంసార జీవితం సాఫీగా సాగుతుంది.

మీ భాగస్వామి చేసే పనిని గుర్తించి వారిని ప్రోత్సహిస్తే వారిలో సానుకూల దృక్పథం పెంచండి. ఒకరితో ఒకరు నిజాయితీ గా ఉండడం వలన జీవితం చాల ప్రశాంతం గా ఉంటుంది. ఇలా మీ సంసార జీవితాన్ని మార్చుకుంటే జీవితాన్ని తృప్తిగా సంతోషం గా గడపవచ్చు.

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.