ఆపిల్ అంటే ఇష్టం పడని వారు అంటూ ఎవరు ఉండరు.. కానీ ఆపిల్ కాయను ఒకసారి కట్ చేస్తే వాటి రంగు మారిపోతుంది. అందుకె ఆపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ క్రింది టిప్స్ పాటించండి.కట్ చేసిన యాపిల్ ముక్కలపై కొన్ని చుక్కల నిమ్మరసాన్ని చల్లితే ఆపిల్ ముక్కలు రంగు మారవు ఎందుకంటే నిమ్మరసంలోని సిట్రికామ్లం యాపిల్ ముక్కలను ఎక్కువసేపు తాజాగా ఉంచiడమే కాకుండా వాటిని రంగు మారనివ్వదు.
అలాగే మరొక చిట్కా ఏంటంటే కప్పు నీటిలో టేబుల్‌స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపి ఆ మిశ్రమంలో యాపిల్ ముక్కల్ని వేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టినా కూడా ఆపిల్ ముక్కలు రంగు మారవు.మరొక చిట్కా ఏంటంటే ఒక కప్పు మంచి నీళ్లలో, రెండు టేబుల్స్పూన్ల తేనె వేసి కలపి ఈ నీటిలో కట్ చేసిన యాపిల్ ముక్కలు వేసి కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల యాపిల్ ముక్కలు ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి.
అలాగే కట్ చేసిన యాపిల్ ముక్కలను ఐస్ నీళ్లలో కొన్ని నిమిషాల పాటు ఉంచి, బయటకు తీసినా గాని ఆపిల్ యాపిల్ ముక్కలు తాజాగా ఉంటాయి.అలాగే ఆపిల్ ముక్కలు కోసిన వెంటనే గాలి చొరబడిన జిప్‌లాక్ బ్యాగ్‌లో బంధించి ఫ్రిజ్‌లో పెడితే తాజాగా ఉంటాయి.యాపిల్ కట్ చేయడానికి మనం ఉపయోగించే చాకు కూడా మంచిది అయి ఉండాలి.పాతబడిన, తుప్పు పట్టిన చాకుల్ని యాపిల్ కట్ చేయడానికి ఉపయోగించకూడదు.