హెల్త్

పెరుగు త్వరగా పులుపు ఎక్కకుండా ఉండడానికి చిట్కాలు..!!

Share

పెరుగు తినడానికి ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పవలిసిన పని లేదు. అలాగే పెరుగులో పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పెరుగులో ఉండే బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. అయితే చాలా మంది పెరుగు కాస్త పులుపు వచ్చినా తినడానికి ఇష్టపడరు.పెరుగు పులుపు ఎక్కకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కానీ ఎన్ని జాగ్రత్తలు. తీసుకున్న ఒక్కోసారి పెరుగు పులుపు ఎక్కుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టినా కానీ ఒకటి రెండు రోజుల్లో పెరుగు నిజానికి పెరుగును వివిధ రకాల వంటకాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.

పెరుగు పాడవకుండా ఉండే చిట్కాలు :

ఐతే ఒక్కోసారి ఫ్రిజ్‌లో పెట్టిన ఒకటి, రెండు రోజుల్లో పెరుగు పులిసిపోవడం లేదా చెడిపోవడం వంటివి జరుగుతుంటుంది.మరి పెరుగు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఏమి. చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..పెరుగును ఎప్పుడు కూడా తేమ, గాలి తగలని చోట నిల్వ చెయ్యాలి. ఎందుకంటే గాలి చొరబడని కంటైనర్లలో అయితే ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది కాబట్టి పెరుగును కూడా ఇలా కంటైనర్లలో నిల్వ చేయవచ్చు. అలాగే కంటైనర్‌ నుంచి పెరుగును తీసినప్పుడల్లా కంటైనర్ మూతను గట్టిగా పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే పెరుగును ఫ్రీజ్‌లో నిల్వ చేయడం వల్ల అందులో సూక్ష్మజీవులు చేరవు.

పెరుగు ఎలా తోడు పెట్టాలి?

ఒకవేళ ఏక్కువరోజులు బయట ఉంటే పెరుగులో హానికరమైన బ్యాక్టీరియా పెరగడానికి దారి తీస్తుంది.
అయితే పాలను తోడు పెట్టేటప్పుడు శుభ్రంమైన గిన్నెలో బాగా మరిగి కాచి అవి గోరువెచ్చగా ఉన్నప్పుడే శుభ్రంమైన స్పూన్‌తో కావల్సిన మేరకు ఫ్రెష్ పెరుగును తీసుకుని పాలలో కలపాలి.ఐతే పెరుగు తీసుకోవడానికి ఉపయోగించే స్పూన్‌ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.అలాగే ఫ్రిజ్‌ డోర్‌లో పెరుగును నిల్వ చేయకూడదు. ఫ్రిడ్జ్ లోపల పెరుగును పెట్టడం వలన పెరుగు పాడవదు. ఈ చిన్నపాటి టిప్స్ పాటించడం ద్వారా పెరుగు త్వరగా పులుపు ఎక్కదు.

 

 


Share

Related posts

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?

Teja

Smoking పొగత్రాగడం మానేయాలని కోరిక బలంగా ఉన్న మనలేకపోతున్నారా?అయితే ఇది ఒకసారి ప్రయత్నించి చుడండి!!

Kumar

Masks ఇలాంటి మాస్క్ లు పెడితే పిల్లకు ప్రమాదం… జాగ్రత్త!!

Kumar