మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనారోగ్యల బారిన పడడంతో పాటు వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.అలాంటి సమస్యలలో పులిపుర్లు సమస్య కూడా ఒకటి.ఈ పులిపిర్లు చర్మంపై ఎక్కడపడితే అక్కడ వస్తుంటాయి. వీటి వలన ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కానీ చూడడానికి మాత్రం చాలా అందవికారంగా కనిపిస్తాయి.ఈ పులిపుర్లు హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ కారణంగా వస్తాయి.ముఖ్యంగా ముఖం, మెడ మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి.ఈ పులిపుర్లను తొలగించుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీటిని తొలగించుకోవడం కోసం మన ఇంట్లో వినియోగించే కొన్ని పదార్ధాలతో ఈ చిట్కాలను ఉపయోగిస్తే పులిపిరులు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి.
పులిపిరులు తగ్గించే చిట్కాలు :
ఒక గిన్నెలో ఒక అర టీ స్పూన్ తెల్లని టూత్ పేస్ట్ ను తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ ఆముదం నూనెను, అర టీ స్పూన్ వంటసోడాను వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు పులిపిర్ల మీద రాసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేయడం వల్ల పులిపుర్లు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి.
తమలపాకు,తడి సున్నం :
ఒక తాజా తమలపాకును కాడతో సహా తీసుకోవాలి. దాని కాడను ఆకు నుండి వేరు చేయాలి. ఇలా వేరు చేసిన కాడను తడి సున్నంలో ముంచి దానిని పులిపిర్ల మీద రాసి అదే కాడతో పులిపిర్ల మీద ఒక 3 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన పులిపిర్లు నయం అవుతాయి.
విటమిన్_ఇ_క్యాప్స్యూల్స్ :
విటమిన్ ఇ క్యాప్స్యూల్ ను బ్రేక్ చేసి, లోపల ఉన్న పదార్థాన్ని స్కిన్ ట్యాగ్స్ మీద అప్లై చేయాలి. విటమిన్ ఆయిల్ నేరుగా పులిపిర్లి మీద పుస్తె చాలు స్కిన్ ట్యాగ్స్ మాయం అవుతాయి.