NewsOrbit
హెల్త్

అప్పుడప్పుడు కాలు తిమ్మిరి ఎక్కుతోందా ? జాగ్రత్తగా ఇది పాటించండి !

అప్పుడప్పుడు కాలు తిమ్మిరి ఎక్కుతోందా ? జాగ్రత్తగా ఇది పాటించండి !

మనం ఒకే చోట కదలకుండా ఉండేప్పుడు ఏర్పడే తిమ్మిరిలతో పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ, దీర్ఘకాలికంగా వేదించే తిమ్మిర్లతోనే జాగ్రత్తగా ఉండాలి. అది వ్యాధులకు సంకేతంగా భావించాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే, నరాల వ్యవస్థ నాశనమవుతుంది.

అప్పుడప్పుడు కాలు తిమ్మిరి ఎక్కుతోందా ? జాగ్రత్తగా ఇది పాటించండి !

ఆ తర్వాత కోలుకోలేనన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, తిమ్మిర్లు అన్నీ ఒకే రకమైనవిగా భావించకూడదు. వీటిలో కూడా తేడాలు ఉంటాయి. ఎక్కువ సేపు కదలకుండా కుర్చున్నప్పుడు సూదులతో గుచ్చుతున్నట్లుగా ఉండటం, మంటలు ఏర్పడటాన్ని పాజిటీవ్ తిమ్మిర్లుగా పేర్కొంటారు. నెగటివ్ తిమ్మిర్లు దీర్ఘకాలికంగా వేధిస్తాయి. ఇవి ఎక్కువ నొప్పి పెడతాయి. ఈ తిమ్మిర్ల వల్ల స్పర్శ కూడా కోల్పోతారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు నెగటివ్ తిమ్మిర్లు ఏర్పడతాయి. వీటిని ‘ప్రెషర్ పాల్సీస్’ అని కూడా ఉంటారు. ఇలాంటి న్యూరోపతీ సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
శరీర అవయవాల కీ వచ్చే  తిమ్మిర్లు వలన  కలిగే వ్యాధులు గురించి  తెలుసుకుందాం .
కొన్ని వ్యాధుల లక్షణాలు తిమ్మిర్లతోనే మొదలవుతాయి. ఇందుకు ఉదాహరణగా మధుమేహం గురించి చెప్పుకోవచ్చు. ఈ వ్యాధి నరాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపించటమే ఇందుకు కారణం. మధుమేహ రోగుల్లో మొదట శరీరంలోని అతి పొడవాటి నరం ఎఫెక్ట్‌ అవుతుంది. ఈ నరాలు కాళ్లలో ఉంటాయి కాబట్టి తిమ్మిర్లు కాళ్ళలోనే మొదలవుతాయి. సాధారణంగా మధుమేహం వ్యాధిని గుర్తించే సమయానికే శరీరంలో 20 కి పై గా  నరాలు దెబ్బతిని ఉంటాయి.
శరీరాన్ని ఎక్కువ సేపు కదల్చనప్పుడే తిమ్మిర్లనేవి ఏర్పడుతుంటాయి. తిమ్మిర్లు తగ్గించుకోడానికి వ్యాయమం, యోగా ఒక్కటే సరైన మందు.
లాక్‌డౌన్ వల్ల వర్క్‌ ఫ్రం హోమ్ చేస్తున్నవారు తప్పకుండా ప్రతి గంటకు ఒకసారి లేచి ఐదు నుంచి పది నిమిషాలు నడవాలి.
ఎక్కువ దూరాలు ప్రయాణించేవారు లేదా వాహనాలను నడిపేవారు కనీసం రెండు గంటలకు ఒకసారైన విశ్రాంతి తీసుకోవాలి. వాహనం దిగి కాసేపు నడవాలి.
ఎక్కువ సేపు టైప్ చేసేవాళ్లు, కంప్యూటర్లలో డాక్యుమెంటేషన్ చేసేవాళ్లు.. వేళ్లకు అప్పుడప్పుడు విశ్రాంతినివ్వాలి. లేదా వేళ్లకు ప్యాడ్స్ వంటివి ధరించైనా పని చేయాలి.  ఎక్కువ బిగుతుగా ఉండే షూ లేదా చెప్పులు ధరించినా తిమ్మిర్లు పుడతాయి. నరాలు ఒత్తిడికి లోనవుతాయి. కాబట్టి.. వీలైనంత వదులైన షూలే వేసుకోండి.
ఏ సమస్య ఉన్నవెంటనే డాక్టర్ ని కలవడం మంచిది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri