Black spots:అందమైన, కాంతివంతమైన ముఖం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. ఎదుటివాళ్ళకి అందంగా కనిపించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ముఖం మీద బ్లాక్ స్పాట్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటూ తమ అందాన్ని డామినేట్ చేస్తూ ఉంటాయి.ముఖం తెల్లగా ఉన్నవారు అయితే ఈ నల్ల మచ్చల వలన మరింత ఇబ్బంది పడతారు అనే చెప్పాలి.ఈ బ్లాక్ స్పాట్స్ నివారించడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాటిలో కలిపే రసాయనాల వలన ముఖం మరింత అందవిహీనంగా కనిపిస్తుంది. అందుకే మేము చెప్పే ఈ సింపుల్ హోం రెమెడీస్ ఉపయోగించి బ్లాక్ స్పాట్స్ తగ్గించుకోవచ్చు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Black spots: ఓట్స్ పేస్ మాస్క్ :
ముఖం మీద ఉన్న మచ్చలను పోగొట్టే విషయంలో ఓట్స్ బాగా ఉపయోగపడతాయి. ముందుగా కొన్ని ఓట్స్ ను తీసుకుని పౌడర్ గా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకుని మీ ముఖానికి అప్లై చేయాలి. ఈ పేస్ మాస్క్ వలన ముఖం మీద ఉన్న డార్క్ స్పాట్స్ మెల్లగా మెల్లగా తగ్గుముఖం పడతాయి
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఉల్లిపాయ రసం:
డార్క్ స్పాట్స్ ను తగ్గించే విషయంలో ఉల్లిపాయలు బాగా ఉపయోగపడతాయి. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని పూయండి. అది డ్రై అయిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ముఖం మీద ఉన్న నల్లమచ్చలు తగ్గుముఖం పడతాయి.ఉల్లిపాయ రసంలో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ నల్ల మచ్చలను తగ్గిస్తాయి. డైరెక్ట్ ఉల్లిపాయ రసం అప్లై చేయడం కంటే ఉల్లిపాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి రాసుకోవడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది. నిమ్మరసం అనేది చర్మ సంరక్షణలో బ్లీచింగ్ ఏజెంట్ గా పనిసి డార్క్ స్పాట్స్ ను మాయం చేస్తుంది.
మజ్జిగ:
ముఖానికి మజ్జిగ రాసుకుంటే కూడా డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. ఎందుకంటే మజ్జిగలోని లాక్టిక్ యాసిడ్స్ చర్మానికి చాలా మంచి చేస్తాయి. బట్టర్ మిల్క్ లో ఒక కాటన్ బాల్ ను ముంచి మచ్చలున్న చోట రాసుకుని కాసేపు మర్ధన చేయాలి.ఇలా క్రమం తప్పకుండా రాసుకోవడం వలన ముఖం మీద ఏర్పడ్డ నల్ల మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.