Categories: హెల్త్

తొక్కే కదా అని ఈజీగా తీసుకుంటున్నారా..వాటితో ఎన్ని ఉపయోగాలు తెలుసా..?

Share

కూరగాయలలో వంకాయ, దొండకాయ, బెండకాయ, టొమోటో వంటి కూరగాయలను నీళ్లతో శుభ్రంగా కడిగి వండేసుకుంటూ ఉంటాము. కానీ సొరకాయ, బీరకాయ,దోసకాయ లాంటి కూరగాయలకు పైన చెక్కు తీసి ముక్కలు కోసి కూరలు వండుకుంటాము. అలా తీసేసిన కూరగాయల చెక్కులను పారయడమో లేక మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి పనికిరాదు అని మనం బయట పారేసే ఆ కూరగాయల తొక్కలోనే చాలా రకాల పోషక విలువలు దాగి ఉన్నాయి. అందుకే వీటిని వంటలోనూ, సౌందర్య సాధనాలుగానూ ఉపయోగిస్తున్నారు కొందరు. అదెలా అని అనుకుంటున్నారా. అయితే ఒకసారి ఇది చదవండి.

కూరగాయలు తింటే క్యాన్సర్ రాదా..!?

కూరగాయల తొక్కలతో పచ్చడి :

సొర, బీర, దోస కాయల చెక్కులను తీసేసిన తరువాత వాటిని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత పచ్చిమిరపకాయలు, పల్లీలు కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేపేకున్న కూరగాయల తొక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, చింత పండుగుజ్జు, పల్లీలు అన్నిటిని ఒక మిక్సీ జార్ లో వేసి పచ్చడిలా చేస్తే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి తినడానికి ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది

కూరగాయల తొక్కల వడియాలు :

అలాగే కూరగాయల తొక్కులను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వాటిలో తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం, మిరియాల పొడి వేసి గ్రైండ్‌ చేసి చిన్న ఉండల్లా చేసుకుని ఎండలో ఎండబెట్టి నిలవచేసుకోవాలి. ఇలా నిలవ చేసుకున్న ఉండలతో కూర చేసుకోవచ్చు లేదంటే పప్పుచారులో వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి. ఎండాకాలంలో మనం ఎక్కువగా పుచ్చకాయలను తింటూ ఉంటాము కదా.. పూచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని తిని మిగిలిన తొక్కు బాగాన్ని అంతా పడేస్తుంటాం. దానితో రోటి పచ్చడి లేదా జామ్‌ చేసుకోవచ్చు. ఇంకా కూరగాయల చెక్కును కుక్కర్‌లో మెత్తగా ఉడికించి సూప్‌ లా చేసుకోవచ్చు.లేదంటే కూరగాయల తొక్కలను మెత్తగా రుబ్బి, బియ్యప్పిండిలో కలిపి వడియాలు కూడా పెట్టొచ్చు.చాలా మంది మామిడిపండు చెక్కు తీసి ముక్కలు కోసుకుని తింటూ ఉంటారు.నిజానికి మామిడి పండు యొక్క పై చెక్కుతో సహా తింటేనే శరీరానికి. కావలిసిన పోషకాలు,పీచుపదార్థం అందుతాయి.

కూరగాయల తొక్కలతో పేస్ ప్యాక్ :

అలాగే బంగాళాదుంప చెక్కును మెత్తగా నూరి ప్యాక్‌లా వేసి పావుగంట తర్వాత కడిగేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.అరటిపండు తొక్కను మాస్క్‌గా వేయడం వల్ల ముఖానికి మెరుపు వస్తుంది. కానీ కూరగాయల తొక్కలను ఉపయోగించేటపుడు ఉప్పునీళ్లతో శుభ్రంగా కడిగి మాత్రమే ఉపయోగించాలి.


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

41 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

45 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

3 గంటలు ago