Tomato: ప్రస్తుత కాలంలో చాలామంది రుచికరమైన భోజనం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రెస్టారెంట్లలో కూడా వివిధ రకాల మసాలా కూరలు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో టమాటా కాజు మసాలా కర్రీ కూడా ఒకటి.. దీనిని ఎక్కువగా రోటి ,బటర్ నాన్ వంటి వాటితో ఈ కూర తింటూ ఉంటారు. టమాటా , కాజూ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలామంది రుచి చూసే ఉంటారు. ఈ కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు..
టమాటాలు 4 ,తరిగిన టమాటాలు రెండు, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిర్చి నాలుగు , జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు ,అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి , ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ , గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ , కారం ఒక టేబుల్ స్పూన్, నూనె రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, పసుపు అర టీ స్పూన్, కస్తూరి మెంతి ఒక టీ స్పూన్, కరివేపాకు ఒక రేమ్మ, తరిగిన కొత్తిమీర కొద్దిగా..
మసాలా దినుసుల కోసం.. నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ , సారా పప్పు ఒక టేబుల్ స్పూన్, యాలకులు రెండు , దాల్చిన చెక్క ఒక ఇంచు ముక్క, లవంగాలు రెండు..
తయారీ విధానం..
మిక్సీ జార్లో మసాలా దినుసులను వేసి ఒక పావు గ్లాస్ నీటిని కోసం మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత టమోటాలను కూడా జారిలో వేసి ఫ్యూరీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేసిన తర్వాత నూనె వేడెక్కాక జీడిపప్పు వేసి రంగు మారేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి..
ఇప్పుడు నూనె పైకి తేలే వరకు వేయించాలి. మసాలా చక్కగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత వేయించిన జీడిపప్పు, కసూరి మెంతి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. మూడు నిమిషాలు పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి ఇక అంతే ఎంతో రుచికరమైన టమాటా కాజు మసాలా కర్రీ రెడీ.