Sleep: కంటినిండా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతూనే ఉంటారు.. కొంతమంది నిద్రపోవాల్సిన సగానికంటే తక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు. మరి కొంతమంది నిద్రపోవలసిన సమయం కంటే ఎక్కువ సేపు నిద్రపోతారు.. ఈ రెండూ ఆరోగ్యానికి హానికరమే.. తక్కువ సమయం నిద్రపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే.. అదే ఎక్కువ సమయం నిద్రపోతే అంతకంటే ఎక్కువ ప్రమాదమట..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రోజుకి 8 గంటల కంటే ఎక్కువ సమయం ఎవరైనా నిద్రపోతుంటే వారు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారని అర్థం. 7 నుంచి 8 గంటలు మాత్రమే నిద్రపోయి తప్పనిసరిగా వ్యాయామం చేసే వారు మాత్రం జీవితాంతం హాయిగా ఉంటారు. త్వరగా అనారోగ్య సమస్యల బారినపడరు. అదే ఎక్కువ సేపు గుండె పోటు వచ్చే అవకాశం 146 శాతం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
మరణం సంభవించడానికి గుండెపోటు, క్యాన్సర్ మొదటి రెండు స్థానాలలో ఉంటే.. వాటి తరువాత స్థానంలో అతి నిద్ర వల్ల వచ్చే గుండెపోటు అని నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం బ్రిటన్ లో దాదాపు లక్ష మంది గుండెపోటుతో చనిపోతుండగా.. వారిలో సగానికి పైగా అతినిద్ర అలవాటైన వారే ఉన్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.