టీవీ లో ప్రోగ్రాం చూస్తున్నపుడు చాలా హడావిడి మీ టూత్‌పేస్టు లో ఉప్పు ఉందా..అంటూ వచ్చే యాడ్ మీకు గుర్తుండే ఉంటుంది. కేవలం టూత్ పేస్ట్ గురించి ఇంత అవసరమా అంటే, అవసరం అనే చెప్పాలి. మనిషికి నోటి శుభ్రత అనేది చాలా ముఖ్యమైన అంశం . అందుకే.. ప్రతి రోజూ ఉదయాన్నే ప్రతి ఒక్కరూ నోటిని శుభ్రం చేసుకుంటారు. అయితే, ప్రతి పనికి కొన్ని పద్ధతులు ఉన్నట్లు, నోటిని శుభ్రం చేసుకోవడానికి కూడా కొన్ని చిట్క లు పాటించాలి. ఇందులో ముఖ్యంగా పేస్టు ఎంత వాడాలనే ది కూడా తెలుసుకోవాలి.
మీరు రోజూ పళ్లు తోముకోవడానికి టూత్ పేస్ట్ వాడుతున్నారుకదా.. అయితే జాగ్రత్త,టూత్‌పేస్టు లో ట్రైక్లోసన్ అనే బ్యాక్టీరియా ను చంపే పదార్థం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.ఆ పదార్థం కొద్దిగా కడుపులోకి వెళ్లినా, పేగుల్లో ఉండే ఆరోగ్యకర అవసరమైన బ్యాక్టీరియా ను చంపేయడం వల్ల పేగు కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని మసాచుసెట్స్ ఆమ్‌హెర్ట్స్ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధన లో బయట పడింది.
ఉత్పత్తి దారులు ఆ రసాయనాన్ని వాడకుండా ఉండలేరు. కాని వాటిని వాడితే మనిషికి ప్రమాదమే. అమెరికా లో ఈ రసాయనం పై నిషేధం ఉన్నా మిగితా దేశాల్లో ఆ ఉత్పత్తులపై ఎటువంటి నిషేధాలు లేవని అధ్యయనకారులు వివరించారు. ఇప్పటి కే ఈ రసాయనాన్ని సబ్బు లు, టూత్ పేస్టు లలో విపరీతంగా వాడుతున్నట్టు వారు వెల్లడించారు. పిల్లలు ఆడుకొనే బొమ్మ ల్లో కూడా ఈ రసాయనం వాడటంగమనించవలిసిన విషయం. ట్రైక్లోసన్ గర్భవిచ్ఛిత్తికి కూడా కారణం కావొచ్చని శాస్త్రవేత్తులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.