యూకలిప్టస్ ఆయిల్ ఎంతటి సువాసన వస్తుందో అందరికీ తెలిసిందే. దీన్నే నీలగిరి తైలం అని కూడా అంటారు. దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. దీంట్లో ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే మన చర్మాన్ని సంరక్షించే గుణాలు ఎన్నో ఉంటాయి. యూకలిప్టస్ ఆయిల్‌ను వాడడం వల్ల ఎలాంటి సమస్యల నుంచి బయటవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
* యూకలిప్టస్ ఆయిల్ చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గిస్తుంది. ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి. నిత్యం యూకలిప్టస్ ఆయిల్‌ను ముఖంపై మర్దనా చేస్తుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
* యూకలిప్టస్ ఆయిల్‌ను రూమ్ ఫ్రెషనర్‌గా వాడవచ్చు. బట్టలపై స్ప్రే చేస్తే వాటిపై ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. రూంలో స్ప్రే చేస్తే గాలిలో ఉండే సూక్ష్మక్రిములు నశిస్తాయి. సువాసనలు వెదజల్లబడతాయి.
* శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో ఈ ఆయిల్ మెరుగ్గా పనిచేస్తుంది. దీన్ని వేడినీటిలో పోసి ఆవిరి పడితే ముక్కు దిబ్బడ, జలుబు తగ్గిపోతాయి. వేడినీటిలో ఆయిల్‌ను కలిపి గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతు సమస్యలు తగ్గుతాయి. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
* నొప్పులను తగ్గించడంలోనూ యూకలిప్టస్ ఆయిల్ బాగానే పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్‌ను, ఆల్మండ్ ఆయిల్‌ను కలిపి ఆ మిశ్రమాన్ని నిత్యం 30 నిమిషాల పాటు వాసన పీల్చాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.
* చుండ్రు సమస్య ఉన్నవారు యూకలిప్టస్ ఆయిల్‌తో ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ ఆయిల్‌ను కొబ్బరినూనెతో కలిపి తలకు బాగా మర్దనా చేసినట్లు రాయాలి. తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు తగ్గిపోతుంది.
* యూకలిప్టస్ ఆయిల్‌ను కొద్ది పరిమాణంలో తీసుకుని అందులో నీళ్లు కలిపి నోట్లో పోసుకుని రోజూ పుక్కిలిస్తే దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాసన పోతుంది.
* నిత్యం కొద్దిగా నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపి తాగితే షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టులు ఎలుకలపై చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఇలా వాడేముందు డాక్టర్‌ను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. అలాగే నీటిలో కలపకుండా యూకలిప్టస్ ఆయిల్‌ను నేరుగా తీసుకోకూడదని కూడా వారు హెచ్చరిస్తున్నారు.