tounge: మన నోటి లోపల… సరిపడా బ్యాక్టీరియా తయారవుతుంటే, వయసుతో సంబంధం లేకుండా మీరు యంగ్‌గా కనిపిస్తారు. ప్రతి రోజు నాలుకను శుభ్రం చేసుకుంటూ ఉన్నప్పుడు కొత్తగా బ్యాక్టీరియా మళ్లీ పెరుగుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది మంచి బ్యాక్టీరియా గా చెప్పుకోవచ్చు. ఈ బ్యాక్టీరియా నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అది నోటిలోని లాలాజలం లోకలిసి అది వయసును పెరగనివ్వకుండా కాపాడుతుంది. అసలు ఈ నైట్రిక్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలంటే ఏం చేయాలి అనే అంశం మీద పరిశోధన లు చేయగా కొన్ని విషయాలు బయట పడ్డాయి. నాలికను గీసి పాచిని శుభ్రం చేసుకున్నప్పుడు అక్కడ ఉండే చెడు పదార్థాలు, అతుక్కుపోయి వ్యర్థాలు బయటకు పోతాయి.
దీంతో… ఆ ప్రాంతం శుభ్రంగా ఉండి మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు అవకాశం గా ఉంటుంది. 50 శాతం నైట్రిక్ యాసిడ్ నాలిక ద్వారా ఉత్పత్తిజరుగుతుంది అని టెక్సాస్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ తెలియచేస్తుంది. ముసలితనం త్వరగా రాకుండా చెయ్యడంలో నాలుక ముఖ్య పాత్ర పోషిస్తోందని తెలిపారు.మనం బ్రష్ చేసుకున్నప్పుడు బ్రష్ నాలుక పైన ఉన్న వ్యర్థాలను తొలగించలేదు.నాలుక కోసం కచ్చితంగా టంగ్ క్లీనర్ ఉపయోగించాల్సిందే. వీలైనంత డీప్ గా నాలుకను శుభ్రం చేసుకోవడం మంచిది అని తెలియచేస్తున్నారు. ఐతే… టంగ్ క్లీనర్ గొంతులోకి వెళ్లిపోకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది .అసలు ఇంతకీ నైట్రిక్ యాసిడ్ వయసును ఎలా తగ్గించగలదు? అనే సందేహం కచ్చితం గా వస్తుంది. మన వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలోని క్రోమోజోమ్‌లో దిగువ నుండే భాగం అంతగా పనిచేయదు. దాని ఫలితంగా DNA కూడా సరిగా పనిచేయదు. కణంలోని మైటోకాండ్రియా పనితీరు, సామర్థ్యం రెండు దెబ్బతింటాయి. స్టెమ్ సెల్స్ పనితనం తగ్గిపోయి, గాయాలు తగిలినప్పుడు శరీరం వెంటనే వాటిని నయం చేయలేదు.
మనకు ఈ పరిస్థితి రాకుండా నైట్రిక్ యాసిడ్ బాగా పని చేస్తుంది అని పరిశోధనలో బయట పడింది.నోటిలో ఉండే బ్యాక్టీరియా సృష్టించే నైట్రేట్స్ ఉమ్మి ద్వారా పొట్ట లోకి వెళ్లి నైట్రిక్ యాసిడ్ గా మారుతుంది. ఈ యాసిడ్ కణాన్ని ముసలిదానిగా మారకుండా చేస్తుంది. దాంతో వయసు పెరగదని సైంటిస్టులు చెబుతున్నారు. వయసు పెరగకుండా ఉంచే శక్తి నాలికకు ఉందని తెలుస్తుంది. ఇక ఇప్పుడు మనం నాలికను శుభ్రంగా ఉంచుకుంటే చాలు. అదేంటి బ్రష్ చేసుకున్న వాళ్ళు నాలుక క్లీన్ చేసుకోకుండా ఎలా ఉంటారు అని డౌట్ రావొచ్చు. క్లీన్ చేసుకుంటారు కానీ టంగ్ క్లీనర్ తో కాకుండా రకరకాల పద్ధతులు ఉపయోగించి చేస్తుంటారు. అలా కాకుండా టంగ్ క్లీనర్ తో మాత్రమే చేసుకోవాలి.