Romance: శృంగార జీవితం బేషుగ్గా గా సాగాలని ప్రతి జంట భావిస్తారు. అయితే, నేడు ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో, ఉద్యోగాల ఒత్తిడి,ఆందోళనలు జంటల సంతోషానికి అడ్డంకులుగా వున్నాయి. అంతేకాదు, మీ అలవాట్లు కూడా మీ శృంగార జీవితాన్ని తగ్గించేస్తున్నాయి. ఆరోగ్యకరమైన, మధురమైన శృంగారం తో జీవితం గడపాలంటే, జంటలు కొన్ని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి .
బాస్ మనస్సును గెలుచుకోవడమే కాదు, మీ భార్యను కూడా సంతోష పెట్టాలి. ఆఫీస్ వర్క్ తో ఇంటికి లేట్ గా రావాలిసి వస్తే కాసిన్ని మల్లెలు లేదా ఆమెకి ఇష్టమైనది ఏదైనా తెచ్చి సారీ మీద సారీ లు చెప్పేసి మీ భార్య మూడ్ వెంటనే మార్చండి. దగ్గరగా వెళ్ళి మీ వేలి స్పర్శతో మయమరిచిపోయేలా చేయండి . మీ భాగస్వామి పక్కనుంటే మాత్రం ఫోన్ దూరంగా పెట్టండి. మగవారు లేదా ఆడవారికి ఇటువంటి సమయాలలో పెద్ద శత్రువు లా కనిపిస్తుంది. మంచి శృంగార అనుభూతి పొందుతున్నప్పుడు ఫోన్ మోగకుండా ముందే సైలెంట్ లో పెట్టేయండి. లేదంటే అది రింగ్ అవటం వలన మీ ఇద్దరి మూడ్ పాడవుతుంది.
శృంగారంలో వారానికి కనీసం 3 , 4 సార్లు అయినా, పాల్గొనాలి. ఇది మీ ఒత్తిడి దూరం చేస్తుంది. శృంగారం కూడా ఒక ఆరోగ్యకర వ్యాయామమే అని గుర్తించండి. చక్కని శృంగార భంగిమలతో బరువు తగ్గవచ్చు.
ప్రతి రోజు ఒకే విధంగా శృంగారం చేస్తే విసుగు పుడుతుంది మీకు చక్కటి భంగిమలు ఆహ్లాదాన్ని ఇస్తాయి శృంగారం పూర్తి కాగానే, వెంటనే పక్కకి తిరిగి గురక పెడుతూ నిద్ర పోకండి . మీ స్త్రీని కౌగిలించుకుని ,ఆమెను స్పర్శిస్తూ , ప్రేమ గా మాట్లాడండి. స్త్రీలు ఇలా చేసేవారిని అసలు వదలరు. ఇలాంటి చిట్కాలు పాటిస్తూ మీ శృంగార జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి.