కొబ్బరి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం గా ఉంటాయి.కొబ్బరి రక్తం లోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం తో బాధ పడే వారికీ ఎంతోఉపయోగకరం గా ఉంటుంది. కొబ్బరిలో కేలరీలు తక్కువగా … ఉండి ఫైబర్, కొవ్వు, అధికంగా ఉంటాయి. ఇది రక్తంలోకి చక్కెర విడుదలను మందగించడానికి తోడ్పడుతుంది. మరి కొబ్బరి నీళ్ల వలన ఉపయోగాలు చూద్దాం…
జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది,బరువును తగ్గించడం లో కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడుతాయి.
కొబ్బరి నీళ్ల వలన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. చర్మాన్ని నునుపుగా మరియు ప్రకాశవంతం గామారుస్తుంది.మానసిక ఒత్తిడిని తగ్గించి శరీరానికి అధిక తేమను అందిస్తుంది.మధుమేహం వ్యాధితో బాధ పడేవారు కూడా కొబ్బరి నీటిని ఎటువంటి సందేహంతాగవచ్చు . కొబ్బరి నీళ్లు రక్తంలోని చక్కెర స్థాయిని క్రమబద్దీకరించి షుగర్ నుఅదుపులో ఉంచుతుంది.
నిత్యం కొబ్బరి నీళ్లు తాగే వారికి వృద్ధాప్యం రాకుండా కాపాడుతుంది. ఇక కొబ్బరి నూనె విషయానికి వస్తే జుట్టుకు బాగా పోషణనిస్తుంది. అందుకే దీనిని మాత్రం తల నూనె గా ఎక్కువ వాడుతారు. కొబ్బరి నూనె పొడి,మరియు గరకు గా ఉండే జుట్టు, చుండ్రు, జుట్టు రాలడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది.
చర్మ సమస్యల ను పోగొట్టుకోవడానికి ఇంట్లో పెద్దవారు కొబ్బరినూనెనే ఎక్కువగా వాడుతారు. దోమ కాటుకు గురైనప్పుడు, ఇతర గాయాలు తగినప్పుడు ఇంట్లో మొదట కొబ్బరి నూనె నే రాయమని చెప్తారు. ఇది చర్మంపై గీతలు, గడ్డలు, మచ్చలు, గాయాలను మాన్పడానికి ఉపయోగపడుతుంది.
ఇది ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు పోషకాలను కలిగి ఉంది. కనుక ప్రతిఒక్కరూ తప్పక తినాల్సిన పదార్థం కొబ్బరి. దీనిని కూరలతోపాటు తీపి వంటకాలు చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి పట్టించుకుంటే… చుండ్రు సమస్య కి గొప్ప ఉపశమనంగా ఉంటుంది.