అధిక బరువు.. అనేదిఈ రోజుల్లో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిని వేధిస్తున్న సమస్య . అందంగా, నాజుగ్గా కనిపించాలని కోరుకొనివారు ఉండరు.
కానీ మనశరీరం అందుకు వ్యతిరేకం గా ఉంటుంది. ముఖ్యంగా కొందరు ఆహారం తినకుండా కడుపు మాడ్చుకున్నా,బరువు తగ్గకపోగా పెరుగుతూనే ఉంటారు. అధిక బరువు తగ్గడం కోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ముఖ్యంగా ఎన్నో రకాల డైట్లు, రక రకాల వ్యాయామాలు చేసినా బరువు మాత్రం తగ్గరు. అయితే కొన్ని తప్పకుండ పాటించవలిసిన టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలి అనుకునేవారు.. ముందుగా చేయాల్సింది.. నీరు ఎక్కువగా తాగాలి.
నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట నిండిన అనుభూతి కలిగి ఎక్కువ ఆహారం తినకుండా చేస్తుంది. తద్వారా బరువు తగ్గొచ్చు.అంతే కాకుండా నీరు ఎక్కువగా తీసుకొంటే ఆరోగ్యం తో పాటు అందమైన శరీరం కూడా సొంతమవుతుంది. అలాగే షుగర్, కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే ఆహారాని కి దూరం గా ఉండాలి. బరువు తగ్గాలి అని అనుకుంటే గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి. ఇందులో సమృద్దిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో అధికకెలోరీలను తగ్గించడమే కాకుండా దృడమైన ఆరోగ్యాన్నీ కూడా ఇస్తాయి.
ఇక ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. దీని వల్ల రోజంతా తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇక పెరుగు, ఇడ్లీ, మజ్జిగ, పనీర్ వంటి ఆహార పదార్థాల్లో ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి.వీటిని ఆహారం లో చేస్ర్చుకోవడం వలన ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు బరువు తగ్గడం లో బాగా సహాయపడతాయి . భోజనానికి ముందు సూప్ తీసుకోవడం వల్ల తినే కేలరీల సంఖ్య తగ్గుతుంది. మరియు బరువు తగ్గేందుకు కూడా ఉపయోగ పడుతుంది.
వారానికి 5 రోజులు ఖచ్చితంగా అరగంట పాటు నడకకి కానీ వ్యాయామం కి కానీ సమయం కేటాయించి తీరవలిసిందే.అప్పుడే బరువు తగ్గడం తేలికవుతుంది.బరువు అదుపులో ఉండాలంటే రోజు కి 7 నుండి8 గంటల నిద్ర చాల అవసరం.