Theraphy: మనస్సు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలంటే ఈ థెరపీ ట్రై చేసి చూడండి!!  

Share

Theraphy: ఆందోళన   ఒక్కటి ఉంటే చాలు  సర్వ రోగాలకు  కారణమవుతుంది. హార్ట్ ఎటాక్,తలనొప్పి, బీపీ, బరువు పెరిగిపోవడం,షుగర్,  పొట్ట లో గడబిడ, ఇరిటేషన్, డిప్రెషన్, నిద్రలేమి… ఇలా ఎన్నో వ్యాధులకు అదే మూలం అని చెప్పవచ్చు. సువాసనలు,   మనకు ఆహ్లాదం గా ఉండేలా చేయడం తో పాటు,ఒక్కసారిగా మన లో తెలియని ఆనందం కలిగేలా చేస్తాయి.  ఇలా జరగడానికి అరోమా థెరపీ ఒక్కటే మార్గం. ఇందులో వాడే  సెంట్ నూనెలను  మొక్కలు పూలు, వేర్లు,మూలికలు, ఆకులు నుంచి తీస్తారు. ఆ తైలాలు గాల్లో కలుస్తాయి. ఇప్పుడు వాటిని మనం పీలిస్తే, మన  శరీరంలో కి అవి వెళ్లి ..  మన మైండ్ గ్రహించడం  వలన  వాటిలో ఉండే సుగుణాలు మన మెదడు ను  శాంత పడేలా   చేసి భారాన్ని తగ్గిస్తాయి.  అరోమా థెరపీ వల్ల ప్రత్యేక  ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తలనొప్పి అరికట్టడం తో పాటు కొత్త ఉత్సాహం, ఆనందం కలిగేలా చేస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా  సాగుతుంది. జలుబు తగ్గుతుంది. మరి ఏ  నూనెలతో   ఎలాంటి బెనిఫిట్స్   కలుగుతాయి అనేది  చూద్దాం.

నెరోలీ ఆయిల్(Neroli Oil ): ఇది ఒత్తిడిని వెంటనే తగ్గించడంతో పాటు…   ప్రశాంతమైన ఫీల్ ని  కలిగిస్తుంది. ఏకాగ్రత  పెరిగేలా చేస్తుంది. ఈ తైలాన్ని ఒక్క చుక్క  టిష్యూ పేపర్ పై  వేసి ,మన దగ్గర   పెట్టుకుంటే,గాలిలో తేలి వచ్చే ఆ సువాసనలు పీలిస్తే సరిపోతుంది.  రోజ్ మేరీ ఆయిల్(Rosemary oil):  జ్ఞాపక శక్తి  తగ్గుతున్న, చిరాకు పెరుగుతున్నా రోజ్ మేరీ తైలం  అద్భుతంగా పనిచేస్తుంది.  ఇది శక్తి ఇవ్వడం తో పాటు..  వ్యాధినిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది . స్నానం  చేసే  నీటిలో ఓ రెండు చుక్కలు వేసుకుని  స్నానం చేస్తే  సువాసన వస్తూనే ఉంటుంది.   బాత్‌రూంలో చెడు వాసన గా అనిపించినా కూడా   రోజ్ మేరీ తైలం రెండు చుక్కలు టాయిలెట్ పేపర్ పైన, లేదా ఇంకెక్కడైనా వేసి ఉంచితే,  చెడు వాసన    పోయి సువాసనలు  వస్తుంటాయి.

తులసి తైలం(Basil oil): నెగిటివ్ ఆలోచనలు  పోగొట్టడం తో పాటు వేడెక్కిన బుర్ర చల్లబరుస్తుంది. ఏకాగ్రత  పెరిగి స్పష్టమైన ఆలోచనలు వస్తాయి. పని చెయ్యాలనే ఉత్సాహం  కలిగేలా చేస్తుంది.   గిన్నెలో కొద్దిగా నీరు  పోసి అందులో ఓ చుక్క కంటే తక్కువ తులసి  ఆయిల్  చేసుకోవాలి.  ఒక పెద్ద సైజు క్లాత్ తీసుకుని     నీటిలో ముంచి ఆ క్లాత్   శరీరం  లేదా ముఖం పై కప్పుకొని నిద్ర పోవాలి.నిద్ర నుండి లేచేసరికి మంచి ఉత్సాహం గా ఉంటారు.నిమ్మకాయ తైలం(Lemon Oil ): రకరకాల రోగాలు మన చుట్టూ ఉన్న  ఉన్నప్పుడు,నిమ్మ తైలం యాంటీ వైరల్‌లా పనిచేస్తుంది. చాలా మంది దీన్ని డిఫ్యూజన్  లో వేసి వాడతారు. ఓ క్లాత్‌పై  వేసుకుని  కూడా  వాడుకోవచ్చు. టీట్రీ ఆయిల్(Tea tree Oil):  ఈ ఆయిల్ ఓ చుక్క తీసుకుని  నీటిలో వేసి… ఆ నీటిలో ఓ క్లాత్ ముంచి… దానితో ఆఫీస్ లేదా ఇళ్లలోని ప్రదేశాలు, మౌస్, కీబోర్డ్, డైనింగ్ టేబుల్, లంచ్ టేబుల్స్, ఫోన్ ఇలా వేటినైనా సరే శుభ్రం  చేస్తే …  ఆ ప్రదేశం అంతా సువాసన భరితం అవుతుంది.


Share

Related posts

పిల్లల సంతోషం కోసం తండ్రి ఇలా చేస్తే చాలు!!

Kumar

వరుడు కన్నా వధువు వయసు ఎక్కువ ఉంటే??

Kumar

Hair loss: బట్టతల రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి!!(పార్ట్ -2)

siddhu