Kiss: ముద్దు పెట్టుకునేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే ముద్దు మరింత మధురం గా ఉంటుంది. నోరు ఎట్టి పరిస్థితులలో దుర్వాసన రాకుండా చూడండి. ముద్దు పెట్టే ముందు వరకు మీరు చూయింగ్ గం తిన్న పరవాలేదు కానీ ముద్దు పెట్టేటప్పుడు మాత్రం నోట్లో ఉండకూడదు. పెదాలను డ్రై కానివ్వకుండా, చూడగానే ముద్దు పెట్టుకోవాలి అనిపించేలా ఉంచుకోండి. మీరు ముద్దు పెడుతున్నప్పుడు మీ చేతి వేళ్ళు ఎదుటివారి తలలో ఉంచి నిమరడం వల్ల ఎక్కువ మూడ్ లో కి వెళ్ళిపోతారు.
మీరు కాస్త పొట్టిగా ఉండి తలలో చేయి పెట్టడం వీలుకాకపోతే .. భుజాలపై లేదా నడుముపై చేతులు ఉంచి అవతలి వారిని చుట్టేస్తే ఇంకా బావుంటుంది.ముద్దు పెట్టుకునేటప్పుడు లాలాజలం కంట్రోల్ చేసుకోవాలి. ముద్దు పెట్టేటప్పుడు లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అయితే దాన్ని బయటకు అసలు రానివ్వకూడదు. మీ పెదాలను తడిచేసుకోండి కానీ మరీ లాలాజలం కారేలా ఉంటే ఎదుటి వారికి చిరాకు కలుగవచ్చు.
ముద్దు పెట్టుకునేటప్పుడు అవతలివారిపై వాలిపోకూడదు. మీ బరువు అవతలివారిపై పడడం వల్ల వారికి ముద్దు మధురంగా కాకుండా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే వారి బరువును మీరు సపోర్ట్ చేస్తూ ముద్దు పెట్టుకోవడంమంచిది. లేదంటే మంచంపై పడుకొని,గోడకు ఆని, లేదా కింద కూర్చొని ఇలా వివిధ భంగిమలలో ముద్దును ట్రై చేయవచ్చు. మీరు ముద్దు పెట్టడంలో మొదటిసారే టాలెంట్ చూపలేక పోవచ్చు.
అందుకే ఒకవేళ మీ భాగస్వామి ముద్దు ఇలా కాదు అని,వేరేలా పెట్టడం మీకు నేర్పుతుంటే తప్పుగా చూడకండి. మీకంటే తనకు ఎక్కువగా తెలుసని, దీనివల్ల మీ బంధం మరింత రొమాంటిక్గా మారబోతోందని సంతోషించండి. ఇద్దరి మధ్యలో ఈగోలు, కోపాలు రాకుండా ఉంటే మీ బంధం పాతదవుతున్న కొద్దీ మరింత అందంగా ,ఆనందం గా ఉంటుంది .
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?