Typhoid: టైఫాయిడ్ గురించి అందరూ వినే వుంటారు. టైఫాయిడ్ జ్వరాన్ని ఆంత్రిక జ్వరం, సాల్మొనెల్ల టైఫిగా కూడా పిలుస్తారు. అయితే ఎక్కువగా ఎవరికైనా ఈ జ్వరం వచ్చినట్లయితే టైఫాయిడ్ వచ్చింది అని సాధారణంగా పిలుస్తూ వుంటారు. ఇక ఈ వ్యాధి “సాల్మొనెల్ల ఎంటేరికా సరోవర్ టైఫి” అనే బాక్టీరియా వలన మనుషులకు సోకుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ వ్యాధి అతిసారం, దద్దుర్లు కలుగజేసే ఒక అంటువ్యాధి అని కూడా చెప్పవచ్చు. ఇది ఎక్కువగా నీటి ద్వారా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే కలుషితమైన నీరు, ఆహారాన్ని తీసుకోవడంద్వారా ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది.
అయితే తాజాగా శాస్త్రవేత్తలు దీని విషయమై ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఈ జ్వరానికి కారణమైన సాల్మనెల్లా ఎంటెరికా సెరోవార్ టైఫి బ్యాక్టీరియా యాంటీ బయాటిక్ మందులకు లొంగడంలేదని అంటున్నారు. ఈ విషయాన్ని లాన్సెట్ మైక్రోబ్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరించింది. ఈ బ్యాక్టీరియా జన్యుక్రమాన్ని విశ్లేషించి చూడగా ఔషధాలకు లొంగని మొండి ఎస్. టైఫి బ్యాక్టీరియా రకాలు 1990 నుండి దక్షిణాసియాలోని భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి ఇతర దేశాలకు 200 రెట్లు ఎక్కువగా పాకాయి. ప్రపంచమంతటా ఏటా కోటీ పది లక్షల టైఫాయిడ్ కేసులు సంభవిస్తే వాటిలో 70 శాతం దక్షిణాసియాలోనే సోకడం కొసమెరుపు.
ఇకపోతే, టైఫాయిడ్ జ్వరం వలన ప్రపంచమంతటా ఏటా లక్షకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. టైఫాయిడ్ జ్వరపీడితులకు మొదట యాంపిసిలిన్, క్లోరాంఫెనికాల్, ట్రైమ్తోప్రిమ్/సల్ఫామెథాక్సజోల్ వంటి యాంటీబయాటిక్స్ ఇస్తారు. వీటికి లొంగని శక్తిని సంపాదించిన ఎస్.టైఫి రకాలను ఎండీఆర్ (మల్టీడ్రగ్ రెసిస్టెంట్)గా వర్గీకరిస్తారు. ఇంకా సిప్రోఫ్లోక్ససిన్, ఆఫ్లాక్ససిన్ వంటి క్వినలోన్ యాంటీబయాటిక్స్, ఎజిత్రోమైసిన్, ఎరిత్రోమైసిన్ వంటి మాక్రోలైడ్ యాంటీబయాటిక్స్‌నూ తట్టుకోగల జన్యువులు కూడా ఎస్.టైఫి బ్యాక్టీరియాలో కనిపించాయి. మూడో తరం యాంటీబయాటిక్స్ అయిన సెఫాలో స్పోరిన్లకు లొంగని జన్యువులు ఈమధ్య కాలంలో కనిపించడం గమనార్హం.
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, అందాల భామ రాశి ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పక్కా…