Thippathega: తిప్ప తీగ ఔషధ ఉపయోగాలు | సైడ్ ఎఫెక్ట్స్

Share

Thippathega: హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎన్నో ఔషధ గుణాలున్న Thippatheega ఆరోగ్య ప్రయజనాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ గురించి షేర్ చేస్తున్నాను.

తెలుగు నామం: తిప్ప తీగ
ఇంగ్లీష్ నామం: హార్ట్ లీవ్డ్ మూన్సీడ్
లాటిన్ నామం: టినోస్పొర కార్డిఫోలియా
సంస్కృత పేరు: అమృత వల్లి

uses-and-side-effects-of-thippathega-medicine
uses-and-side-effects-of-thippathega-medicine

తిప్ప తీగ అనేది ఔషద మొక్క. ఇది మెని స్పర్మేసి జాతికి చెందినది. ఇది తమలపాకు రూపంలో చిన్నగా, అందంగా ఉంటుంది. దీనిని ఎన్నో ఆయుర్వేద మందులలో, టాబ్లెట్స్ రూపంలో, పౌడర్ రూపంలో విరివిగా ఉపయోగిస్తారు. తిప్ప తీగ ని జూస్ లా కూడా చేస్తూ ఉంటారు. ఇది ఊర్లలో, పొలాలలో, రోడ్ పక్కన, కొండలలో, ఇంటి పరిసరాల లో ఎక్కువ గా దొరుకుతుంది. ఇది అన్ని సీజన్లలో చుట్టుపక్కల, పచ్చని మొక్కలపై పెరుగుతుంది.

uses-and-side-effects-of-thippathega-medicine
uses-and-side-effects-of-thippathega-medicine

ఆయుర్వేద వైద్యంలో Thippathega అనేది మూడు అమృత్ మొక్కలలో ఒకటి. అమృత్ అంటే దేవతల అమృతం అని అర్థం. అందుకే దీనిని సంస్కృతంలో అమృతవల్లి అని పిలుస్తారు. తిప్పతీగ ని ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే thippatheega లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఈరోజు మనం చూద్దాం.
తిప్ప తీగ కు మరణం అనేది ఉండదు ఎందుకంటే దానిని తుంచిన అక్కడ నుండి మళ్ళీ కొమ్మలకి అల్లుకుంటూ వస్తుంది. ఆయుర్వేదంలో తిప్ప తీగ తో మందును తయారు చేసి శంకమినివటి గా అంద చేస్తున్నారు.

uses-and-side-effects-of-thippathega-medicine
uses-and-side-effects-of-thippathega-medicine

Thippathega: తిప్పతీగ ఔషధ ప్రయోజనాలు:-

​ఇపుడు ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరికీ వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం. ఎందుకంటే మనం నిత్యం కొత్త కొత్త వ్యాధులను వింటున్నాం. ఈ వ్యాధులను అధిగమించాలంటే రోగ నిరోధక శక్తి ని పెంచుకోవాలి. అయితే ఈ Thippatheega శరీరానికి అవసరమయ్యే వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఆయుష్షు ని, శక్తిని పెంచుతుంది.
​తిప్ప తీగ శరీరంలో ఉండే మలినాలను తొలగిస్తుంది. చర్మం రంగు, నిగారింపు, మెరుపుని మెరుగపరుస్తుంది. చర్మ వ్యాధులతో బాధపడే వారికి తిప్పతీగ నూనె ని ప్రభావిత ప్రాంతాల్లో రాస్తే త్వరగా నయం చేస్తుంది. చర్మం పై వచ్చే ముడతలను తగ్గిస్తుంది.
​ఉబ్బసం, ఆయాసం, శ్వాస వ్యవస్థ వంటి వాటిని నయం చేయడానికి తిప్పతీగ తో తయారు చేసిన ఆయుర్వేద మందులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

​జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. నులి పురుగులు, ఆకలి లేకపోవటం, వాంతులు, అధికదాహం, కడుపు మంట, నొప్పి వంటి వాటిని నివారించడానికి సహాయపడుతుంది.
​ఒత్తిడి, ఆందోళన, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
​కింటి చూపును పెంచడానికి పనిచేస్తుంది.
​అధిక జ్వరం, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులను తగ్గిస్తుంది.
​Thippatheega లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. దీని వలన మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా ని తొలగించడంలో బాగా పని చేస్తుంది.
​ఇందులో యాంటి ఆక్సిడెంట్స్, యాంటి ఇనఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీని వలన అర్ధ రైటిస్ వంటి వ్యాధులను నయం చేయడానికి, నొప్పిని తగ్గించడానికిచడానికి, గౌట్ వ్యాధులను దూరం చేసే లక్షణాలు తిప్ప తీగ లో ఉన్నాయి.
​ఇది అన్ని రకాల మధుమేహ వ్యాధులకు ఉపయోగిస్తారు. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
​తిప్ప తీగ కాండం ని కిడ్నీ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
​తిప్ప తీగ ని ఎలా వాడాలి:-

​తిప్ప తీగ ని నీడలో ఆరబెట్టి పొడిగా చేసి వాడుకోవచ్చు.
​దీనిని ని ఇంకా పప్పు గా చేసుకోవచ్చు.
​తిప్ప తీగ జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
​వేడి పాలలో తిప్ప తీగ పౌడర్, తాటి బెల్లం, కొంచెం అల్లం రసం వేసి తాగితే కీళ్ల నెప్పులు తగ్గుతాయి.

uses-and-side-effects-of-thippathega-medicine
uses-and-side-effects-of-thippathega-medicine

తిప్పతీగ సైడ్ ఎఫెక్ట్స్:-

​తిప్ప తీగ ని అధికంగా తీసుకుంటే మలబద్దకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.
​ఆయుర్వేద వైద్యులు సమక్షంలో మాత్రమే తిప్పతీగ ను ఉపయోగించాలి.
​పాలు ఇచ్చే తల్లులు, గర్భవతులు Thippathega ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు.


Share

Related posts

NTR: ఎన్టీఆర్ కోసం మహేష్ బాబు హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్న కొరటాల శివ..??

sekhar

ఇలా చేస్తే మెరిసే పళ్ళు మీ సొంతం!!

Kumar

బోగస్ ఓట్లు: ఈసీపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Siva Prasad