మన అందరికి పుదీన గురించి తెలిసే ఉంటుంది.ఏ వంటకయినా మంచి రుచిని,వాసనను తీసుకురావాలంటే ముందుగా మనం వాడే ఆకు ఏదన్నా ఉంది అంటే అది పుదీనా. ఆకు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.పుదీనాను కేవలం వంటల్లో రుచి, వాసన కోసం మాత్రమే ఉపయోగిస్తాము అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే పుదీనా ఆకు వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.మరి పుదీనాలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఈజీ డైజేషన్ :
పుదీనా ఆకులలో విటమిన్ ఎ,సి మరియు బి కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం,మాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేస్తుంది. పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.అంతేకాకుండా యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి.అలాగే పుదీనాలో మెంథాల్ అనే సమ్మేళనం ఉండుట వలన కడుపు ఉబ్బరం,గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని వెైద్యులు చెబుతున్నారు
నోటి దుర్వాసన మటుమాయం :
ఆస్తమా సమస్య ఉన్నవారికి పుదీనా ఒక మంచి మెడిసిన్ లాగా పని చేస్తుంది అనే చెప్పాలి.ఆస్తమా ఉన్నవారు రెండు లేదా మూడు పుదీనా ఆకులను నమిలి తింటే ఆస్తమా నుంచి ఉపశమనం పొందుతారు.పుదీనాలో ఉండే క్రిమినాశక లక్షణాలు,
మెంథాల్ నోటిలోని బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించి,నోటిని శుభ్రంగా ఉంచి నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది.ఈ పుదీనా ఆకులను పేస్ట్‌లా చేసుకుని దీంతో దంతాలు తోముకుంటే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.అలాగే నోరు వాసన వచ్చేవారు పుదీనా ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి అందులో కాస్త ఉప్పు వేసుకుని ఆ పొడితో రోజూ పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన మాయం అవ్వటమే కాదు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుదల :
పుదీనా ఆకులు మెదడుకు ఒక మెడిసిన్ లాగా పని చేస్తాయి.ఇవి జ్ఞాపకశక్తిని పెంచి వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి మతిమరుపు వ్యాధిని తగ్గిస్తుంది.యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి మరియు డిప్రెషన్ ని తగ్గించి మానసిక ప్రశాంతత కలిగిస్తుంది.
అధిక బరువుకు చెక్:
అధిక బరువు సమస్యతో బాధపడేవారు పుదీనా కషాయం చేసుకొని ప్రతి రోజు తాగితే 15 రోజుల్లో బరువు తగ్గుతారు.నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…