మనం తినే ఆహారంలో ఉప్పు లేకపోతే అసలు తినలేము. ఎందుకంటే ఉప్పు లేని కూరను ఉహించుకోవడమే కష్టం.ఉప్పు తక్కువ అయితే పర్లేదు కానీ ఉప్పు ఎక్కువ అయితే మాత్రం అసలు తినలేము. ఆహారానికి రుచిని చేకూర్చడంలో ఉప్పు యొక్క పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.సముద్రం నుండి లభించే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటుంది. మన శరీరంలో జరిగే జీవక్రియలన్నింటికీ లవణం చాలా అవసరం. ఈ లవణం మనకు ఉప్పు రూపంలో అందుతుంది.అయితే ఉప్పును మరి అంత ఎక్కువగా తినకూడదు.అలా అని మరి తక్కువగా కూడా తినకూడదు. ఎందుకు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..అసలు రోజుకు ఎంత మోతదులో ఉప్పును తీసుకోవాలో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉప్పును ఎంత మోతదులో తీసుకోవాలంటే..?
మన శరీరంలో జరిగే రసాయన చర్యలన్నింటిలోనూ ఉప్పు పాత్ర చాలా ఉంటుంది. శరీరంలో సోడియం మోతాదు తక్కువైతే డీ హైడ్రేషన్ బారిన పడడమే కాకుండా చికాకు, కోపం, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి.పోషకాహార సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం రోజుకు 6 గ్రాముల ఉప్పును తీసుకోవాలి.కానీ మనకు తెలియకుండానే ఎక్కువ మొత్తంలో ఉప్పును తీసుకుంటున్నాము. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం అధికంగా చేరి రక్తపోటును పెంచుతోంది.
ఉప్పు ఎక్కువ తింటే ఏమవుతుంది..?
రక్తపోటు పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా సోడియం ఎక్కువైతే కాల్షియం శాతం తగ్గి ఎముకలు కుడా వీక్ అవుతాయి. ఫలితంగా కీళ్ల నొప్పుల వంటి సమస్యలు తలెత్తుతాయి. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల మెదడులో ఆక్సిజన్ శాతం తగ్గి మెదడులో కణాలు దెబ్బతింటాయి. దీని వల్ల బీపీ ఎక్కువై పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తింటే మూత్ర పిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.అలా అని ఉప్పును పూర్తిగా తీసుకోకపోయినా మనకు ప్రమాదమే.అందుకే ఉప్పును తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…