హెల్త్

Organic Products : వీటిని వాడితే మీ డబ్బు  హాస్పిటల్ కి ఖర్చు అవడం తగ్గుతుంది!!

Share

Organic Products :  ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి  ఎలా మారాలి   అనేది తెలుసుకుందాం ?
సేంద్రీయ ఉత్పత్తులను వాడే ముందు మనం తెలుసుకోవాలిసింది ఏమిటంటే వీటి  వాడకం అధిక ఖర్చుతో కూడుకున్నది.    ఇంకా చెప్పాలి అంటే ఆర్గానిక్ప్రొడక్ట్స్ ను, మామూలు ప్రొడక్ట్స్ తో పోల్చి చూస్తే అధిక ధర గా అనిపిస్తుంది.  దీనికి కారణం సేంద్రీయ వ్యవసాయం కష్టం  పైగా ఎక్కువ సమయం  పడుతుంది.  ఇది ధర ఎక్కువగా ఉండడం వల్ల మనలో కొంతమంది సేంద్రీయ ఉత్పత్తులను  తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. ప్రొడక్ట్స్ మీద డబ్బు ఖర్చు చెయ్యడం మంచిదా,అనారోగ్యం మీద  ఖర్చు చేయడం మంచిదా ఒకసారి ఆలోచించండి.

1.  ఆరోగ్యకరమైన ఆహారం కోసం  మీ   నెలవారీ బడ్జెట్ ని  కాస్త పెంచండి.      లేదంటే  మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుని తర్వాత హాస్పటల్ కి లక్షల్లో ఖర్చు  పెట్టేకంటే, ఆరోగ్యకరమైన ఆహారం  మీద ఖర్చు పెట్టడం చాలా అవసరం.
2. ఆర్గానిక్ఉత్పత్తుల వాడకానికి   ముందుగా  రైస్, గోధుమ పిండి, పప్పులు  తో మొదలు పెట్టండి. ఇది మన జీవితంలో  ఆరోగ్యం మీద గొప్ప మార్పు చూపెడుతుంది.
3. ఆర్గానిక్  లో  పండిన  కూరగాయలు, పళ్ళు వారం లో  రెండుసార్లయినా వాడండి
4. హార్మోన్స్ నిండిన పాలు, పెరుగు తీసుకోవడం  బదులుగా ఆ స్థానం లో  ఆర్గానిక్ వి వాడండి
5. ఏదైనా  ఒక ఉత్పత్తి కొనే ముందు  దాని లేబుల్ జాగ్రత్తగా  చదివి  ఆ ప్రొడక్ట్ లో ఏం ఉన్నాయో పూర్తిగా  తెలుసుకోవాలి.
6. మీ ఇంటిలో  స్థలం ఉంటే మీకు అవసరమైన  కూరగాయలు మీరే ఆర్గానిక్ విధానంలో పండించుకోండి. అదేవిధంగా పళ్ళు, ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు. ఇప్పుడు  తక్కువ స్థలం కూడా పండించడానికి అనుకూలం గా ఉండే పద్దతులు వచ్చాయి. వాటి గురించి  కనుక్కోండి.
మీరు క్రమేణా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి మారడానికి ఉపయోగపడే సూచనలు ఇవి.
మనం ఎలాంటి ఆహారం తింటామో మన బుద్ది , ఆలోచనలు, మన ఎమోషన్స్  అన్ని కూడా అలానే  ఉంటాయి.  కాబట్టి  ఆహారం విషయంలో  తగినంత  జాగ్రత్త  అవసరం.


Share

Related posts

Lemons: వావ్.. నిమ్మకాయల వల్ల ఇన్ని ఉపయోగాలా..?!

Ram

Alcohol : మీరు మద్యం సేవించేటప్పుడు వీటిని తీసుకుంటే గుండెపోటు తధ్యమట !!

Kumar

ఈ తప్పు చేస్తే జన్మలో బరువు తగ్గరు… మీ ఇష్టం!

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar