Good Luck: మీకు త్వరలోనే అదృష్టం, ధనం కలిసి రాబోతుంది అని తెలియ చేసే గుర్తులు ఇవే
ఈ సంకేతాలు ఎదురవడం వలన అదృష్టం పడుతుంది అని రకరకాల శాస్త్రాలు తెలియ చేస్తున్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.
నీటి పక్షి
నిద్రలేవగానే కొబ్బరికాయ ( Coconut ) కానీ తెల్లటి నీటి పక్షి కానీ కనిపిస్తే ఏదో ఒకవైపు నుంచి మీకు డబ్బు రాబోతోందని సంకేతం గా గుర్తించాలి.
ఆవు: మీ కు చెందిన భూమిలో ఆవు గడ్డి తింటూ ఉన్నప్పుడు కోప్పడి వెళ్లగొట్టకండి. ఎందుకంటే అది మీకు అదృష్టం వరిస్తుందని తెలియచేసే సంకేతం.
స్నేక్:
మీ కలలోతెలుపు రంగు లేదా గోల్డ్ కలర్ పాము కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారు అని , ధనం మీ దగ్గరకు వస్తోందని దీని సంకేతం.
కోతి:
మీరు ఎక్కడికైనా వెళ్ళడానికి బయలుదేరిన తర్వాత కోతి కానీ , కుక్క కానీ , పాము కానీ , పక్షి కానీ మీరు వెళుతున్న వాహనానికి కుడివైపుగా ఉంది అంటే.. మీరు త్వరలోనే ధనవంతులవుతారు అనడానికి సంకేతం.
కలలో
మీ కలలో గ్రీనరీతో పాటు నీరు కనిపించింది అంటే .. అతి త్వరలో ఊహించని విధంగా డబ్బు మీ సొంతమవుతుందని దీని అర్థం.
పాల ఉత్పత్తి :
ఉదయం నిద్రలేచిన తర్వాత మొదట చుసిన వస్తువులుగా పాలు , పెరుగు ఏదైనా పాల ఉత్పత్తి అయి ఉంటే కనుక చాల త్వరలో మీరు డబ్బు పొందబోతున్నారు అని అర్ధం.
భజనలు
గుడి గంటలు,శంఖం శబ్ధం, లేదా వినసొంపైన భజనలు వినపడుతుండగా తో నిద్రలేచారు అంటే.. అదృష్టంతో పాటు, ధనం కూడా మిమ్మల్ని వరిస్తుంది అని అర్ధం.
సింధూరంతో
మీరు బయటకు బయలు దేరినప్పుడు వివాహిత ,ముఖంపై సింధూరంతో కనిపిస్తే త్వరలోనే మీకు భారీ మొత్తంలో డబ్బు అందుతుందని అర్ధం.