NewsOrbit
న్యూస్ హెల్త్

Virus Infection: సర్పి వ్యాధి తొందరగా తగ్గటానికి ఈ చిట్కాలు..!!

Virus Infection: సర్పి వ్యాధిని కొన్ని ప్రాంతాల్లో సలిపిరి అని కూడా పిలుస్తుంటారు. ఇది హెర్పస్ ఇన్ఫెక్షన్ ఒక విధమైన వైరస్ వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య శరీరంలో ఒక వైపే వస్తుంది. రెండవ వైపు రాదు అని వైద్యులు చెబుతుంటారు. ఈ సమస్యను వైద్యులు మూడు విధాలుగా చెబుతుంటారు. ఈ వ్యాధి వచ్చేందుకు ముందు దశ, వ్యాధి వచ్చిన తరువాత దశ, వ్యాధి తగ్గిపోయిన తరువాతి దశ ఇలా మూడు దశలుగా ఉంటుంది. ఈ వ్యాధి రావడానికి రెండు మూడు రోజుల ముందు ఒక భాగంలో నొప్పి వస్తుంది.. ఆ తరువాత రెండు రోజుల్లో ఆ ప్రాంతంలో బొబ్బలతో కూడిన గుల్లలు వస్తాయి. అప్పుడు విపరీతమైన మంట, పోటు, నొప్పి, సలుపు ఉంటుంది. ఇది నాలుగు నుండి ఆరు రోజుల వరకూ ఉంటుంది. ఆ తరువాత గుల్లలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. మూడవ దశలో పైకి ఏమి కనబడదు కానీ ఆ వైసర్ ప్రభావం కొన్ని రోజుల పాటు లేదా కొంత మంది కొన్ని నెలల పాటు ఉంటుంది. ఈ కాలంలో పేషంట్ కొంత అసౌకర్యంగా, నొప్పితో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. హెర్పస్ వైరస్ నాడి మీద పని చేసి ఆ నరాన్ని దెబ్బతీయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

Virus Infection herpes
Virus Infection herpes

Virus Infection: పై పూత మందు ఇలా

అయితే వ్యాధి నివారణకు గృహ వైద్య విధానం ఉంది. దానిలో ఒక గృహ వైద్య విధానంలో పైపూత మందు ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ గృహ వైద్య విధానం వల్ల త్వరగా నయం చేసుకునే వీలు ఉంటుంది. పైపూత మందు తయారు చేసుకోవడానికి నల్లజీలకర్ర, నెయ్యి తీసుకోవాల్సి ఉంటుంది. నల్లజీలకర్ర పచారీ దుకాణాల్లో, ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంటాయి. నల్లజీలకర్ర ను పొడిగా చేసుకుని దానికి తగినంతగా నెయ్యిని కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఆ పేస్టును హెర్పస్ ఇన్ఫెక్షన్ శరీరంపై ఎక్కడ ఉందో ఆ భాగంలో రాయాలి. రోజుకు రెండు పూటల అంటే ఉదయం సాయంత్రం ఆ ప్రదేశం లో రాయాలి. అది రాసిన అరగంట తరువాత గోరు వెచ్చటి నీళ్లతో ఆ ప్రదేశాన్ని కడిగి వేయడం గానీ, తుడిచి వేయడం గానీ చేయాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే తగ్గుతుంది. ఒక వేళ నెయ్యి అందుబాటులో లేకపోయినా, దొరకకపోయినా నెయ్యి స్థానంలో కొబ్బరినూనెను ఉపయోగించుకోవచ్చు.

 

సొంటి, ఉసిరిక, పసుపుతో

అదే విధంగా కడుపులోకి తీసుకునేందుకు కూడా ఓ మందును తయారు చేసుకోవాలి. అది ఎలాగంటే సొంటి, ఉసిరిక, పసుపు తీసుకోవాలి. సొంటి చూర్ణం 25 గ్రాములు, ఉసిరిక చూర్ణం 25 గ్రాములు, పసుపు 25 గ్రాములు (సమపాళ్లలో) కలుపుకుని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని ఉదయం ఒక సారి సాయంత్రం ఒక సారి భోజనానికి 15 నిమిషాల ముందు తెేనెతో కలిపి తీసుకుంటే అతి త్వరలో ఈ వ్యాధి తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అల్లోపతి వైద్య విధానంలో యాంటీ వైరల్ డ్రగ్స్ ఇస్తుంటారు. అయితే వైద్యుల సూచనల మేరకు వాటిని వాడాల్సి ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju