Vitamin K: విటమిన్ కే లోపం ఉంటే రక్తహీనత లేదా అనీమియా ఏర్పడవచ్చు. అనీమియా వల్ల నీరసంగా, ఓపిక లేకుండా ఉంటారు. కడుపు నొప్పికి కూడా విటమిన్ కే డెఫిషియెన్సీ కారణం కావచ్చు. ముక్కులో నుండి రక్తం కారడం కూడా విటమిన్ కె సరిపోయినంత లేదనడానికి సూచనగా భావించవచ్చు. విటమిన్ కె లోపం ఉన్నవారికి బోన్ ఫ్యాక్చర్ ప్రమాదం ఉంటుంది. అలానే గుండె లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. అలానే క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కూడా విటమిన్ కె తోడ్పడుతుంది. విటమిన్ కె పుష్కలంగా ఉన్న అహార పదార్ధాలు ఇవే..వీటిని నిత్యం ఆహారంలో ఉండే విధంగా చూసుకుంటే విటమిన్ కే లోపం రాదు.
ఆకు కూరలు: పాలకూర, గోంగూర, బచ్చలి వంటి ఆకుపచ్చని రంగులో ఉండే ఆకు కూరల్లో విటమిన్ కే పుష్కలంగా లభిస్తుంది. వీటిలో విటమిన్ కే తో పాటు విటమిన్ ఏ, విటమిన్ సీ లు కూడా ఉన్నాయి. వీటిని రోజు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.
క్యాబేజీ: క్యాబేజీను కురగానే కాకుండా చైనీస్ ఫుడ్ లపై చల్లుకుని కూడా తింటారు. అలాగే పకోడిలుగా కూడా వెసుకోవచ్చు. ఏ కరంగా తీసుకున్నా వీటిలో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ బీ 6 శరీరానికి అందుతాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
పచ్చి భఠానీలు: గ్రీన్ పీస్ తినే మార్గాలు అనేకం. వీటిని కూరల్లో వేసుకోవచ్చు. లేదా వాటితో అనేక రకాలుగా స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. పిల్లలకి కూడా ఇష్టమైన స్నాక్స్ ని వీటితో చేయవచ్చు. వారినికి రెండు మూడు సార్లు పచ్చి బఠానీలను ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కె లు సమతూకంలో ఉంటాయి. బఠానీల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కివీ ఫ్రూట్స్ లో విటమిన్ కే తో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి 12, బీ 6, విటమిన్ ఇ, ఐరన్ కాల్షియం, పొటాషియం ఉంటాయి. నాన్ వెజ్ విషయానికి వస్తే చికెన్ లోనూ అధికంగా విటమిన్ కె లభిస్తుంది.