ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Vitamin: విటమిన్ టాబ్లెట్స్ అందరూ వేసుకోవచ్చా..!?

Share

Vitamin: విటమిన్ టాబ్లెట్స్ వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది.. వీటికి తోడు ప్రోబయోటిక్స్, మూలికా ఔషధాలు, చేపనూనె వంటివి ఎవరికి నచ్చినట్టు వారు తీసుకుంటున్నారు.. వాస్తవానికి విటమిన్ మాత్రలు మనకి అవసరమా..! ఒకవేళ వీటిని తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఎప్పుడైనా ఆలోచించారా..!?

Vitamin: Tablets Helpful or not
Vitamin: Tablets Helpful or not

ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, కార్బోహైడ్రేట్స్, నూనెలు, కొవ్వు లతో కూడిన పోషకాహారం తగినంత తింటే చాలు. కొంతమంది వీటన్నింటిని సహా సరిగ్గా తీసుకోకపోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. కొంత మందికి ఆయా ఆరోగ్య సమస్యల వలన పోషకాల మాత్రలు అవసరమవుతాయి. విటమిన్ మాత్రలతో జబ్బులు మాత్రమే నయమవుతాయని అనుకుంటే పొరపాటే ఈ టాబ్లెట్స్ కేవలం ఆహారం ద్వారా లభించే పోషకాలను భర్తీ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి అని గుర్తుంచుకోవాలి.

విటమిన్ టాబ్లెట్స్ ఏ నుండి జెడ్ వరకు లభిస్తాయి. వృద్ధులకు విటమిన్ డి, విటమిన్ బి 12, క్యాల్షియం వంటి విటమిన్లు పోషకాలు అదనంగా తీసుకోవాలి. విటమిన్ బి12 మాంసాహారంలో మాత్రమే లభిస్తుంది. అందువలన శాఖాహారులు దీని లోపం తలెత్తకుండా మాత్రలు, టానిక్ ను వైద్యులు సిఫార్సు చేస్తారు. గర్భిణీలకు పోలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది బిడ్డ నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి రోగాలతో బాధపడుతున్న వారికి అదనంగా కొన్ని పోషకాలు అవసరమవుతాయి. ఎవరికీ ఎలాంటి పోషకాలు ఎంత మోతాదులో కావాలనేది ఊహించడం కష్టం. మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అని వేటినిబడితే వాటిని వేసుకుంటే మీ ఆరోగ్యానికే ముప్పని గుర్తించాలి. వైద్యులను సంప్రదించి వారి సూచించిన మేరకు మాత్రమే విటమిన్ టాబ్లెట్స్ ను ఉపయోగించాలి.


Share

Related posts

Chiku Fruit: సపోటా మన శరీరానికి చేసే సపోర్ట్ ఏంటంటే..!?

bharani jella

Vakeel Saab : అర్జెంట్ గా ముగ్గురు అమ్మాయిలు కావాలి – పవన్ సినిమా షూటింగ్ లో భారీ ట్విస్ట్

arun kanna

Tollywood: ఆరంభంలోనే ఆశాభంగం!బంగార్రాజు తప్ప బాక్సాఫీస్ వద్ద చీదేసిన జనవరి మూవీలు !టాలీవుడ్ లో నిరాశ నిట్టూర్పులు

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar