Clock: ఇంట్లో ఏ వస్తువులు దాస్తే ఉంచాలనేది వాస్తు శాస్త్రం వివరిస్తుంది. వాస్తులో దిక్కులు చాలా ముఖ్యమైనవి.. ఇంట్లో ఏ దిక్కున ఎలాంటి వస్తువు పెట్టాలి. ఏ మూలన బరువైన వస్తువులు ఉండకూడదు.. ఎటువైపు బరువు ఉంచాలి.. వంటి విషయాలన్నీ కూడా వాస్తు చక్కగా వివరించింది.. జీవితం అంటే కాలం.. కాలమంటే దైవమే. అటువంటి కాలాన్ని కొలమానంలో పెట్టి మనకు చూపించే పరికరం గడియారం. ఇది మనకు కాలపురుషుడి గమనాన్ని తెలియజేస్తుంది. అటువంటి గడియారాన్ని ఏ దిక్కున పెట్టుకుంటే మంచి జరుగుతుందో అసలు ఏ దిక్కున పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం చెడిపోయిన, ఆగిపోయిన గడియారం ఉంచకూడదని ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే అలా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉండడం అశుభానికి ప్రతీక. చెడిపోయిన, ఆగిపోయిన గడియారాలు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ని ఆహ్వానిస్తాయి. అందుకని మన పెద్దలు కూడా పగిలిపోయిన, ఆగిపోయిన గడియారాలను ఇంట్లో ఉండనివద్దని చెబుతుంటారు.బెడ్ రూమ్లో గోడ గడియారం పెట్టుకోకూడదు. ఇది నిద్రకు ఆటంకం మాత్రమే కాదు, పీడకలలు రావడానికి కూడా కారణం అవుతుంది.
ఈ దిక్కున పెట్టకండి..
దక్షిణ దిశను యమస్థానంగా చెబుతారు. అందుకే గడియారాన్ని ఎప్పుడూ ఇటు వైపుగా పెట్టకూడదు. అలాగే మీ ఇంటికి పడమర దిక్కున కూడా గడియారాన్ని పెట్టకూడదు. ఇంకా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కూడా పెట్టకండి. ఇంటి ప్రధాన ద్వారంపై గడియారాన్ని ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతాయి. ఇంట్లో ప్రశాంతంగా ఉండదు, ఎప్పుడూ తెలియని ఒక టెన్షన్ ఉంటుంది. అందుకే ప్రధాన ద్వారం పైన ఉన్న గోడ దగ్గర గడియారం పెట్టకూడదు.
ఇక్కడ పెడితే మంచిది..
వాస్తు ప్రకారం గడియారాన్ని ఎప్పుడు ఉత్తరం, తూర్పు దిశలో పెట్టుకోవాలి. ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల ఇంటి సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. ఇంట్లో ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?