Gruhapravesam: ఇంగ్లీష్ మాసాల నుండి తెలుగు మాసాలు ఇలా తెలుసుకోండి.
1.March – April చైత్రము
2.April – May వైశాఖము –
3. May – June జ్యేష్ఠము
4.June – July ఆషాఢము
5. July – August శ్రావణము
6.August – September భాద్రపదము
7.September – October ఆశ్వయుజము
8. October – November కార్తికము
9.November – December మార్గశిరము
10. December – January పుష్యము
11.January – February మాఘము
12. February – March ఫాల్గుణము
Gruhapravesam: గృహ ప్రవేశం ఏ మాసాలలో చేస్తే మంచిదో తెలుసుకుందాం:- వైశాఖ మాసం , జ్యేష్ట మాసం , శ్రావణమాసం , (sravanamasam ) కార్తీక మాసం , మాఘ మాసం , ఫాల్గుణ మాసాలు శుభ ప్రదం గా చెప్పబడివని.అలాగే గృహ ప్రవేశానికి శుభాన్ని కలిగించే వారాలు తెలుసుకుందాం. సోమవారం , బుధ వారం , గురు వారం, శుక్ర వారాలు గా చెప్పబడినవి.
గృహప్రవేశానికి శుభ తిధులు గురించి తెలుసుకుందాం :- 1. విదియ , 2. తదియ, 3. పంచమి, 4. సప్తమి, 5. దశమి, 6. ఏకాదశి, 7. త్రయోదశి,8. పౌర్ణమి,
గృహప్రవేశానికి శుభ నక్షత్రాలు :- 1. రోహిణి , 2. మృగశిర , 3. ఉత్తర, 4. చిత్త , 5. అనురాధ, 6. ఉత్తరాషాఢ ,7.ధనిష్ఠ, 8. శతభిషం, 9. ఉత్తరాభాద్ర, 10. రేవతి .
గృహప్రవేశానికి శుభ లగ్నాలు :- 1. వృషభ, 2మిధున, 3. కన్య, 4. ధనుస్సు , 5. కుంభ, 6. మీన లగ్నాలు శుభం గా చెప్పబడినవి.
Gruhapravesam: దర్వాజాలు మూసి ఉంచాలి
గృహ ప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. గృహ ప్రవేశం జరిగిన తర్వాత మాత్రమే సామానం ఇంట్లోకి తీసుకువెళ్లి పెట్టుకోవాలి. గృహ ప్రవేశం చేయడానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉంచాలి.అంటే గృహప్రవేశ సమయానికి ఆ ఇంటిలో ఏమి ఉండకూడదు. కొన్ని,కొన్ని సార్లు పూర్తిగా కట్టడం అవక ముందే.. ముహూర్తాలు దాటి పోతున్నాయి అని.. లేదా మళ్లి చాలా కాలం వరకు ముహూర్తాలు ఉండవు అని తెలిస్తే ముహూర్తం సమయానికి ఇంట్లో చేయించాల్సిన కరంటు ,ప్లంబింగ్, ఉడ్ వర్కు వంటి కొంత పని మిగిలి ఉన్నా వాటిని తర్వత కూడా చేయించుకోవచ్చును. కాని ఎట్టి పరిస్థితులలో ఇంటికి తలుపులు పెట్టనిదే గృహ ప్రవేశం మాత్రం చేయకూడదు.
మంచి గుమ్మడికాయ
చాల మందికి గృహప్రవేశం ముహూర్తానికి గృహం లో కి ప్రవేశించాలా? లేదా పాలు పొంగించాల? అని ఒక సందేహం ఉంటుంది.వేద పండితుల చేత గృహ ప్రవేశ ముహూర్తానికి ముందుగా పూర్తి చేసుకోవాలిసిన కార్యక్రమాలు అన్ని శాస్త్రోకతమ్ గా పూర్తి చేసుకుని సరిగ్గా ముహూర్తం సమయానికి యజమాని అడుగు పెట్టాలి.ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే గృహ ప్రవేశ సమయం లో మంచి గుమ్మడికాయను పగలకొట్టే కార్యక్రమం కేవలం మగవారు మాత్రమే చేయాలి. ఎట్టి పరిస్థితులలో ఆదావారు ఆ పని చేయకూడదు. గృహ ప్రవేశం చేసిన రోజున ఆ ఇంట్లో మణి ద్వీప వర్ణన పారాయణ చేస్తే వాస్తు దోషాలు తొలగి శుభం జరుగుతుంది.