Child: పిల్లలకు సెలవులు ఇచ్చిన.. తల్లిదండ్రులు లాంగ్ లీవ్ పెట్టుకున్న పిల్లలతో కలిసి బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.ఇప్పుడు కరోనా వలన పిల్లలు ఇంటిలో నే ఉంటున్నారు కదా.. ఒకవేళ వాళ్ళతో కలిసి సరదాగా ఎక్కడికైనా పర్యాటక ప్రదేశానికి వెళ్లి రావాలని అనుకుంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని వెళ్తే మీ ట్రిప్ ఆనందం గా గడుస్తుంది.
పిల్లలను తీసుకుని బయటికి వెళ్ళేటప్పుడు వారు ఎక్కడైనా తప్పిపోతారెమో అని బయపడుతుంటాము. అలాంటి టెన్షన్ లేకుండా చూసుకోవడానికి ముందుగా మీరు చేయవలసింది ఏమిటంటే పిల్లలకు ఒక గుర్తింపు కార్డు తయారు చేయండి. అందులో పిల్లల పేరు, ఇంటి చిరునామా, కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు వేయండి.అది వారి కి ఇచ్చి ఎప్పుడు జాగ్రత్తగా పెట్టుకొని ఉండాలి అని చెప్పండి. ఆరేళ్ల వయ్యస్సు దాటిన పిల్లల తో బయటికి వెళ్తే.. వారికంటూ సొంతంగా ఒక బ్యాగ్ ఇచ్చి వారే మోసేలా బాధ్యత అప్ప చెప్పండి. ఆ బ్యాగ్ లో చిన్న చిన్న ఆట వస్తువులు, ఒక వాటర్ బాటిల్, కొన్ని చిరుతిండ్లు పెడితే మిమ్మల్ని అది కావాలి ఇది కావాలి లేదా ఆకలి వేస్తుంది అని పదేపదే విసిగించారు.పిల్లలకు బోర్ కొడితే నోటి నుంచి మొదట బయటకు వచ్చే పదం ఏదైనా ఉంది అంటే.. ఆకలి వేస్తుంది అని మాత్రమే అంటారు. కాబట్టి బ్యాగ్ లో ఇవన్నీ సర్ది ఇవ్వండి.
పది సంవత్సరాలు దాటిన పిల్లల తో బయటకు వెళ్ళాలి అని అనుకుంటే, వారికి అవసరమైన వాటిని వారినే సర్దుకోమని తర్వాత మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత మీరు వెళ్లబోయే ప్రదేశాల విశేషాలు, కట్టడాలు, స్మారకాలు వంటి వాటి గురించి వివరంగా చెప్పాలి. అప్పుడు అక్కడికి వెళ్లి వాటిని చూసిన తర్వాత వారికి అవగాహన వస్తుంది.
ఇది వారు ట్రిప్ బాగా ఎంజాయ్ చేయడానికి కూడా పనికి వస్తుంది. ఎందుకంటే చాల సార్లు ఏదైనా ప్రదేశానికి వెళ్లి వచ్చాక అక్కడ కొన్ని చిన్న చిన్న విశేషాలు చూసారా అని ఎవరైనా అడిగితె అయ్యో చూడలేదే అని మనకే ఎంతో బాధగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో ప్రతి దాని గురించి కావలిసినంత ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది.. వాటి ద్వారా తెలుసుకుని వెళ్లి చూసి మరింత ఆనందం పొందండి.