Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా ?అయితే మీ  ఫ్యామిలీ సపోర్ట్ కావాలంటే ఇలా చేయండి!!(పార్ట్ -2)

Share

Love Marriage: మిమ్మల్ని ఎంతో ముద్దుగా,ప్రేమగా పెంచుకున్న మీ పేరెంట్స్ కి మీరు ప్రేమించిన వ్యక్తి గురించి  ఎన్నో అనుమానాలు  ఉంటాయి.  వాటన్నింటికీ జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కచ్చితంగా మీ పైనే ఉంటుంది అనే  విషయాన్ని మీరు  తెలుసుకోవాలి.వారి అనుమానాలు ,బయలు,ఆందోళన అన్ని కూడా మీ భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న కారణంగా కలిగేవే అని   చెప్పవచ్చు.

ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో మీ ఫ్యామిలీ  అడిగిన కొన్ని ప్రశ్నలు మీకు కోపం,అసహనానికి గురి చేయవచ్చు.  అయినా కూడా  మీరు శాంతంగా, ఓపికగా వాటికి సమాధానాలు  ఇచ్చేలా ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ ప్రేమ విషయంలో మీ ఫ్యామిలీ కి ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం  చేయడం మంచిది. మీరు ప్రేమించిన వ్యక్తితో కలకాలం సంతోషంగా ఉంటారు అనే నమ్మకం మీతో పాటు వారికి వచ్చేలా చేయడం మీ బాధ్యత. మీ ప్రేమ విషయంలో మీ  ఫ్యామిలీ కి ఒక క్లారిటీ    రావడానికి మీరు వారికి కావాల్సినంత సమయం  ఇవ్వడం మంచిది.

ప్రేమికులు   సాధ్యమైనంత వరకు ఇరు కుటుంబాల  ఇష్టం తో  వివాహాలు చేసుకోవడం  మీ జీవితాలకి శుభ ప్రదం అని గుర్తు పెట్టుకోండి.  కొన్ని సార్లు  ప్రేమ వివాహాలు  పరిస్థితుల దృష్ట్యా ఒకరి అంగీకారం లేకుండా కూడా జరగవచ్చు. కాకపోతే మీ శక్తివంచన లేకుండా కుటుంబ సభ్యులు అందరి  ఇష్టం తో  పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాలి. నిరంతరం రక్షణ కవచం లా కాపాడే మీ   పేరెంట్స్ ప్రేమ దేనికి సాటి రాదు. కాబట్టి పెళ్ళికి వారు ఒప్పుకునే విధం గా మీరు ట్రై చేయండి. అప్పుడే  మీరు పూర్తిగా సంతోషమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు.


Share

Related posts

బరువు తగ్గాలి అనుకునేవారికి కుంకుమపువ్వుతో బంగారంలాంటి ఐడియా!! ఈజీగా తగ్గొచ్చు…

Naina

లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ బెస్ట్ సూత్రాలు పాటించండి చాలు !

Kumar

ladies: అమ్మాయిలు ఈ వయసులో  మెచ్యూర్ అయితే కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించవలిసిందే !!

siddhu