shopping: డబ్బు వృధా కాకుండా షాపింగ్ చేయాలా?అయితే ఇలా చేసి చూడండి!!

Share

shopping: మన  పెద్దలు డబ్బు వృధా చేయవద్దు.. పొదుపు చేయమని    ఎప్పుడు చెబుతుంటారు.  ఐన కూడా  మనం షాపింగ్ కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు  చేస్తుంటాము. కొందరు   అమ్మాయిలకు, షాపింగ్‌కు మధ్య విడదీయరాని సంబందం   ఉంటుంది.  అందుకే ఇంట్లో ఎన్ని  బట్టలు,వస్తువులు, నగలు ఉన్నా కూడా   షాపింగ్ కి వెళ్లి ఎదో ఒకటి కోనేస్తుంటారు .  విండో షాపింగ్ అంటే చాలు..  ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు.

చాలా సార్లు  మనం ఇక  చేయడం మానేయాలి అని అనుకుంటాం.   రిబేట్లు, డిస్కౌంట్లు  లాంటి  మాటలు చెవిలో పడగానే.. ఆ ప్రలోభాలకు లోనవుతుంటారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన  విషయం ఏమిటంటే ,  షాపింగ్ అంటే మనకు  ఎంత ఇష్టమో .. అదే ఇష్టాన్ని డబ్బు పొదుపు  చేసుకునేందుకు  కూడా చూపించాలి.
ఈ రోజు మీరు పొదుపు చేసే ప్రతి రూపాయి..రేపు మీకు పెద్ద అవసరాన్ని తీరుస్తుంది.  ఈ రోజుల్లో ఏ పండగ వచ్చినా సరే..    షాపింగ్ చేయడం అనేది  అత్యవసరం గా ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భాలలో బడ్జెట్‌ను కూడా   దృష్టిలో పెట్టుకుంటే కనుక   అధిక ఖర్చు నుండి  తేలికగా బయట పడవచ్చు.


అందుకే షాపింగ్ ఖర్చులను  తగ్గించడానికి పాటించాల్సిన కొన్ని   చిట్కాల మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు  ఇంట్లోనే ఉంచండి.  కార్డు చేతిలో ఉంటే   డబ్బులు  చాలా తేలికగా ఖర్చు  పెట్టేస్తాం .. ఎందరో ఈ తరం ఆడవాళ్ళూ  అనుభవపూర్వకంగా చెప్పిన మాట ఇది. చేతిలో డబ్బుంటే.. ఎక్కడ ఖర్చయిపోతుంది అన్న భయం  మానసికంగా  మనిషిని పట్టిపీడిస్తోంది. కనుక కొంత జాగ్రత్తగా ఉంటాం. కానీ కార్డులు చేతిలో ఉంటే మాత్రం   అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి.. ఎక్కువ వస్తువులు కొన్న  ఏమి పర్వాలేదు అనే  ధీమా వచ్చేస్తుంది.  కాబట్టి  మీ డెబిట్, క్రెడిట్ కార్డులు ఇంట్లో పెట్టేసి, ఒక బడ్జెట్ అనుకుని  , దానికి తగ్గట్టుగానే డబ్బులు తీసుకుని షాపింగ్‌కు వెళ్లండి.


Share

Related posts

యాపిల్ పండులోని గింజలు తింటే చనిపోతారా?

Kumar

సోషల్ మీడియాలో సంసారం చేస్తున్న జంటలు!!

Kumar

వైద్యం – రక్షణ : వీరిని  కాపాడేది ఎవరు ?  అర్ధం చేసుకునేది ఎవరు ? 

siddhu