ఈ మధ్యకాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. బరువు పెరిగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చాలామంది అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రక రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.వాటి వలన బరువు తగ్గడం మాట ఎలా ఉన్నాగాని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వస్తాయి.అలా కాకుండా మన ఇంట్లో దొరికే కొన్ని సహజసిద్దమైన పదార్ధాలతో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చుమరి ఆ చిట్కాలు ఏంటో చూద్దామా.!
బరువు తగ్గించే చిట్కాలు :
ముందుగా ఈ రెమిడీ కోసం కొద్దిగా బెల్లం,నిమ్మరసం,మిరియాల పొడి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆర్గానిక్ బెల్లం తురుము వేసి అది బాగా కరిగేవరకు కలపాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల నిమ్మరసం, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలపాలి.ఇలా తయారుచేసిన డ్రింక్ ని ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగితే శరీరంలో అదనంగా ఉన్న కరిగి సులభంగా బరువు తగ్గుతారు.నిమ్మకాయలో ఉండే విటమిన్ సి జీర్ణప్రక్రియ బాగా సాఫిగా సాగేలా చేస్తుంది.. నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను కాపాడతాయి.
ఈ డ్రింక్ వలన ఉపయోగాలు :
అలాగే బెల్లంలో కేలరీలు తక్కువగాను యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.అలాగే జీర్ణ ప్రక్రియ సులువు చేసి టాక్సిన్స్‌ను బయటకు పంపటంలో సహాయపడుతుంది. ఈ డ్రింక్ తాగటం వలన ఊపిరితిత్తులు శుభ్రం అవ్వటమే కాకుండా ఈ సీజన్ లో వచ్చే దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కూడా పెరుగుతుంది.ఉదయాన్నే ఈ డ్రింక్ తాగుతు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే బరువు తగ్గడం సులభతరం అవుతుంది. అంతేకాకుండా ఈ డ్రింక్ తాగడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు