మారుతున్న కాలంతో పాటుగా మనిషి జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఫలితంగా బరువు పెరగడం, వివిధ రకాల వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. చాలా మంది అధిక కొలస్ట్రాల్‌తో బాధపడుతున్నారు.బరువు పెరగడం వలన గుండెపోటు, మధుమేహం, హైబీపీ వంటి అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.బరువు పెరిగాక తగ్గడం ఎలాగో అని ఆలోచించే బదులు బరువు పెరగకుండా జాగ్రత్తలు పాటిస్తే మంచిది అని వైద్యులు సలహా ఇస్తున్నారు. బరువు పెరిగిన తరువాత దానిని తగ్గించుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. వర్క్ ఔట్స్ చేయడం, డైటింగ్ చేయడం, వాకింగ్, జిమ్ అని ఇలా రకరకాల పద్ధతులను ఫాలో అవుతారు.అయితే మరికొందరు మాత్రం మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ ఉపయోగించి బరువు తగ్గాలని చూస్తారు.ఇవే కాకుండా కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా.
అవిసె గింజల పొడి:
అవిసె గింజల గురించి మన అందరికి తెలుసు. వాటిల్లో లినోలెనిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.అందుకే అవిసె గింజల పొడిని వేడినీళ్లతో గాని లేదంటే పాలతో గాని కలిపి తాగితే బరువు సులభంగా తగ్గుతారు. బరువు తగ్గడంతో పాటు జీర్ణవ్యవస్థ,గుండె రెండూ కూడా ఫిట్‌గా ఉంటాయి.
వెల్లుల్లి:
ప్రతి ఒక్కరి వంట గదిలోనూ వెల్లుల్లి ఉంటుంది.వెల్లుల్లిలో ఎన్నో రకాల ఔషదాలు దాగి ఉంటాయి. వెల్లుల్లి తినడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.వెల్లుల్లిని తినడం వలన రక్తపోటు తగ్గుతుంది. అలాగే జీర్ణక్రియ ప్రక్రియ కూడా చురుగ్గా పని చేస్తుంది. ప్రతిరోజూ వెల్లుల్లిని తినడం కానీ లేదంటే వెల్లుల్లి టీ గాని తాగడం మంచిది.
నిమ్మరసం:
నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.నిమ్మకాయను రెగ్యులర్ గా తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది.