25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
న్యూస్ హెల్త్

Weight Loss: ఇంత ఫాస్ట్ గా సింపుల్ డైట్ తో 46 కేజీలు తగ్గిన పోలీస్ ఆఫీసర్.. ఎన్ని రోజులంటే.!?

Weight Loss in 83 kgs in Delhi police officer
Share

Weight Loss: బరువు పెరగడం సులువే కానీ బరువు తగ్గడం మాత్రం చాలా కష్టమని నిదానంగా అర్థమవుతుంది ముఖ్యంగా బరువు తగ్గాలన్న ప్రయత్నిస్తున్న వారికి ఇదొక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు.. వాస్తవానికి వ్యాయామం, డైటింగ్‌లో మార్పుల కారణంగా బరువు తగ్గడం మంచి పరిణామామేకాదు. ఆరోగ్యవంతమైన జీవితానికి అవన్నీ ఉపయోగపడతాయి.. ఢిల్లీకి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ బరువు తగ్గి వార్తల్లో నిలిచారు ఆ డైట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Weight Loss in 83 kgs in Delhi police officer
Weight Loss in 83 kgs in Delhi police officer

ఢిల్లీకి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ అధిక బరువుతో తీవ్ర ఇబ్బందులు పడేవాడు. ఎలాగైనా బరువు తగ్గాలని లైఫ్‌ స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకున్నారు. ఎనిమిది నెలలు తిరిగే సరికే అద్భుత ఫలితం కనిపించింది. డిప్యూటీ కమిషనర్ జితేంద్ర మణి త్రిపాఠికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.. మీరు నిజంగానే బరువు తగ్గారా.. ఎలా తగ్గారు.. ఆ డైట్ ఏంటో మాకు చెప్పండి అంటూ.. కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఆ పోలీస్ ఆఫీసర్ 130 కిలోల బరువు ఉండటంతో మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయి పెరగడంతో పాటు పలు అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. దాంతో తన లైఫ్‌స్టైల్‌ మార్చుకున్నారు. 2022 మొదట్లో ఆ పోలీసు ఆఫీసర్ తన జీవనశైలితో పాటు.. కొన్ని అలవాట్లను మార్చుకోవాలని డిసైడ్‌ అయ్యారు. అందులో భాగంగా ప్రతిరోజూ 15,000 అడుగుల దూరం వాకింగ్ చేసేవారు.. అంటే దాదాపు నాలుగున్నర కిలోమీటర్లు నడిచేవారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నం, చపాతీ వంటి ఆహారాలకు దూరంగా ఉంటూ.. కేవలం సూప్‌లు, సలాడ్‌లు, పండ్లు, కొబ్బరినీళ్లు వంటి అధిక పోషకాలున్న ఆహారాలు తీసుకునేవారు. ఇలా తన డైట్‌లో మార్పులు చేయడంతో పాటు.. శారీరక వ్యాయామాల ద్వారా 46 కిలోలు తగ్గడంతో 130 కిలోల నుంచి దాదాపు 80 కిలోల వరకు బరువు తగ్గారు. మీరు ఈ ఫార్ములా పాటిస్తే సులువుగా బరువు తగ్గొచ్చు..


Share

Related posts

రైలుపట్టాలపై బాంబు

Siva Prasad

కరోన వైరస్ వ్యాప్తి గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి

Siva Prasad

Most eligible bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మీద అంచనాలు పెంచిన ‘ గుచ్చే గులాబి ‘..!

GRK