Weight loss: ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బరువుతగ్గి నాజూగ్గా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ బరువు తగ్గడం అనేది జీవితంలో ఒక కలగానే మిగిలిపోతుంది అని చింతిస్తున్నారా.. అయితే మేము చెప్పే ఈ టిప్స్ పాటిస్తే మీ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో అందరు కూడా బాగా బిజీ అయిపోయారు. ఒక పక్క చదువులు.. మరో పక్క ఉద్యోగాలు అంటూ తీవ్ర ఒత్తిడిని ఎదురుకుంటున్నారు.కనీసం వేళకు తిండి తినే సమయం కూడా దొరకడం లేదు.ఆ తినే కాస్త తిండి అయినా మంచి పోషకాలు ఉన్నా ఆహారాన్ని తింటున్నారా అంటే అది లేదు.. పిజ్జాలని, బర్గర్లని ఫాస్ట్ ఫుడ్ తినడానికి బాగా అలవాటు పడిపోయారు. ఫలితంగా అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అధిక బరువు మిమ్మల్ని వేదిస్తుందా…?
బరువు ఎక్కువగా ఉన్నాకూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు బరువు తగ్గడానికి వ్యాయామాలు చేయమని సలహాలు ఇస్తుంటారు.వ్యాయామం. అన్నా సరిగా చేస్తామా అంటే అది లేదు.ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంవలనో లేక పని ఒత్తిడి వలనో మధ్యలోనే ఆపేస్తుంటారు. అలా చేస్తే ఇంకా బరువు తగ్గాలన్నా కల కలగానే మిగిలిపోతుంది తప్పా కల అనేది నెరవేరదు.. అందుకే మేము చెప్పే ఈ టిప్స్ పాటిస్తే మీరు బరువు సులభంగా తగ్గవచ్చు.
ఆహారంలో మార్పులు చేయండిలా:
ముఖ్యంగా కొవ్వు తీసేసిన పాలను తాగుతూ ఉండాలి. అలాగే కోడిగుడ్డులోని తెల్ల సొన, స్కిన్లెస్ చికెన్, వేరుశనగలు వంటివి ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.హోల్ వీట్, జొన్నలు, తెల్ల ఓట్స్, రాగిమాల్ట్. శెనగలు, రాజ్మా, బొబ్బర్లు, పచ్చి బఠాణి, సోయా ఉత్పత్తులు, పెసలు, మొలకెత్తిన గింజలలో మాంసకృత్తులు, పిండి పధార్ధాలు, ‘బి’ విటమిన్లు అధికంగా ఉంటాయి. ఫలితంగా మీ బరువు తగ్గుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సమయానికి మంచి నిద్ర:
ఇంకో మైఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది రాత్రిపూట త్వరగా పడుకోరు. ఆ అలవాటును ఇకనుండి. అయినా మార్చుకుంటే మంచిది. రాత్రి పూట త్వరగా పడుకోవడం వలన బరువు తగ్గుతారు.ఎందుకంటే త్వరగా పడుకోవడం వలన అర్థరాత్రి అల్పాహారం తీసుకోరు కాబట్టి. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే ముందు మీరు సమయానికి మంచి నిద్ర పోవాలి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వ్యాయామం ఇలా చేయాలంటే..?
అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కాయగూరలు,ముదురు పసుపు, నారింజ రంగు పండ్లు, తాజా ఆకుకూరలు రోజూ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.వ్యాయామం కూడా ప్రతిరోజు చేస్తుండాలి.గంటల తరబడి వ్యాయామం చేసేకంటే చేసే కాసేపు అయినా బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో చేస్తే చాలు.ఫాస్ట్ ఫుడ్, ఫ్రై ఐటమ్స్ కు ఎంత వీలయితే అంత దూరంగా ఉంటే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది