Weight loss: చాలామంది బీట్ రూట్ ను తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే కొందరికి బీట్ రూట్ రుచి నచ్చదు. కానీ బీట్ రూట్ తినడం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం అసలు బీట్ రూట్ ను వదిలిపెట్టరు. ఈ బీట్ రూట్ తో కర్రీ మాత్రమే కాకుండా జ్యూస్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీనిని సలాడ్స్ లో కూడా తినొచ్చు. బీట్ రూట్ లో నైట్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.బీట్ రూట్ కర్రీ తినడం ఇష్టం లేని వాళ్ళు బీట్ రూట్ ను జ్యూస్ చేసుకుని తాగిన ఆరోగ్యానికి మంచిది.
ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A, విటమిన్ B6, ఐరన్ లతో పాటుగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.
అలాగే అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి బీట్ రూట్ హెల్ప్ అవుతుంది. ఎలాగంటే బీట్ రూట్‌లో ఉండే నైట్రేట్స్ రక్తంలో కలిసి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారతాయి. తద్వారా ఇవి రక్తంలో హెచ్చు తగ్గులు లేకుండా కంట్రోల్ చేయడం వలన బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
ఈ కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. బరువు తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారికి బీట్ రూట్ ఒక వరం అనే చెప్పాలి. ఎందుకంటే
బీట్ రూట్ జ్యూస్‌లో ఫ్యాట్ ఉండదు. అలాగే కేలరీలూ కూడా తక్కువగానే ఉంటాయి.అందుకే రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.
అలాగే బీట్ రూట్‌లో బీటైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది లివర్‌కు ఉన్న ఫ్యాట్ ను,పాయిజన్‌ను తొలగించి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వలన మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది.ఫలితంగా మనలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలకు బీట్‌రూట్ చాలా మంచిది.గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…