హెల్త్

బరువు తగ్గడంలో ఈ చిట్కాలు భలే పని చేస్తాయి తెలుసా..?

Share

ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. బరువు తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ బరువు సులభంగా తగ్గవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో. చూద్దామా..

గ్రీన్ టీ : గ్రీన్ టీ అనేది కామెల్లియా సినెన్సిస్ ఆకుల నుండి తయారు చేయబడే ఒక టీ. ఈ గ్రీన్ టీ మన బరువును తగ్గించడంలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ఎందుకంటే గ్రీన్ టీలో ‘0’ కేలరీలు ఉంటాయి.అలాగే గ్రీన్ టీలో అత్యంత శక్తివంతమైన ఎపిగాల్లోకాటెచిన్ -3-గాలెట్ అనే సమ్మేళనం ఉంటుంది.ఇది జీవక్రియ రేటు (బాడీ మెటబాలిజం)ను మెరుగుపరచడంతో పాటు ,శరీర బరువును కూడా నియంత్రిస్తుంది..

తులసి : తులసి ఆకుల రసంను ఆయుర్వేదంలోను,ఇంటి వైద్య చిట్కాలలో కూడా విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు.ఎందుకంటే తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి.తులసి వలన మనకు చాలా రకాల ఆరోగ్య. ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా తులసి ఆకుల వలన శరీరంలో ఉండే అధిక కొవ్వు తగ్గుతుంది.తులసి ఆకులు శరీరంలోని మలినాలను బయటకు పంపించి శరీర బరువును తగ్గిస్తాయి. అలాగే మన యొక్క జీర్ణక్రియ ప్రక్రియను కూడా సాఫిగా అయ్యేలా
చేస్థాయి.

అల్లం :శరీర బరువు మరియు శరీరంలోని లిపిడ్ పదార్ధాలను తగ్గించడంలో అల్లం ఎంతగానో సహాయపడుతుంది.అల్లం శరీర ఉష్ణోగ్రతను పెంచి ఆకలిని తగ్గిస్తుంది.ఫలితంగా బరువు తగ్గడం జరుగుతుంది. అలాగే జీర్ణక్రియ సమయంలో మీరు బర్న్ చేసే కేలరీల సంఖ్యను మెరుగుపరచడానికి కూడా అల్లం బాగా సహాయపడుతుంది.


Share

Related posts

Lock Down: లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు… తెలంగాణ‌లోనే కాదు ఈ రాష్ట్రాల్లో కూడా…

sridhar

Anger మీకు ప్రతిదానికి కోపం వస్తుందా ?అయితే ఇలా చేసి చూడండి!!(పార్ట్ -1)

Kumar

Birthday: బర్త్ డే కి కొవ్వొత్తులు ఆర్పీ, కేక్ కట్ చేయడం వెనుకున్న విషయం  ఏమిటో తెలుసా?

Kumar