NewsOrbit
హెల్త్

Weight Loss : రెండు పూట్ల అన్నం తింటూ బరువు తగ్గవచ్చు… అయితే ఈ జాగ్రత్తలు  మాత్రం పాటించాలి !!

Weight Loss :  కొద్ది మోతాదులో అన్నాన్ని తింటూనే :
బరువు తగ్గి సన్నబడాలి అనుకున్నవారు  ముందుగా చేసే పని ఏదైనా ఉంది అంటే అది  అన్నం తినడం మానేయడమే.  కానీ  ఇక్కడ తెలుసుకోవాలిసిన విషయం ఏమిటంటే, రోజుకు రెండుసార్లు అన్నం తింటూ కూడా బరువు తగ్గవచ్చని పరిశోధనలు  కూడా తెలియచేస్తున్నాయి.     మీరు విన్నది నిజమే  రోజూ కొద్ది మోతాదులో అన్నాన్ని తింటూనే బ‌రువు తగ్గవచ్చంటున్నారు న్యూట్రిష‌నిస్టులు.  అయితే దీనికోసం కొన్ని చిట్కాలు పాటిస్తే మాత్రం మీరు సన్నగా అవడం ఖాయం. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం..

weight-loss-will-be-followed-by-fatigue-and-constant-tiredness-2
weight loss will be followed by fatigue and constant tiredness 2

 

Weight Loss :  ఆహారాన్ని బాగా నమిలి :

భోజ‌నం  చేయడానికి అర గంట ముందు కీర‌దోస‌, క్యారెట్‌, బీట్‌రూట్‌, జామ‌కాయ వంటివి  తింటే క‌డుపు నిండిన భావ‌న  కలిగి అన్నం త‌క్కువ‌గా   తినడం జరుగుతుంది.  ఎక్కువ సేపు ఆకలి లేకుండా ఉంటారు.   అన్నం తినే ముందు ఎంత తినాలి అనేదాన్ని కచ్చితం గా నిర్ణ‌యించుకోవాలి.  మీరు అన్నం ఎంత తింటారో, అంతే  పరిమాణం లో  కూర కూడా తినాలి.   అంటే అన్నంతోపాటు స‌మానంగా కూర కూడా  తినాలి. మీరు తినాలన్న ఆహారాన్ని బాగా నమిలి ,నమిలి తినాలి.   దానితో పాటు రోజు కాసేపు పుష్ అప్స్, స్క్వాట్స్ వాకింగ్ చేయడం  వంటి తగిన శారీరక శ్రమ వలన శ‌రీరం  బరువు పెరగదు.  వీటితో పాటు చ‌క్కెర‌, నూనె ప‌దార్థాల వాడ‌కం ఎంత తగ్గిస్తే అంత మంచిది.  ఇలా చేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువును  తేలికగా తగ్గించుకోవచ్చు.  రాత్రి అన్నం తిన‌డం మంచిది కాదు అనేది స‌రైన  మాట కాదు.

weight-loss-will-be-followed-by-fatigue-and-constant-tiredness-2
weight loss will be followed by fatigue and constant tiredness 2

అన్నం   మానేయ‌డం  :

రాత్రి తినాలన్న  భోజనం తగిన పరిమాణం లో   7. 30 లోపు తినేలా చూసుకోవాలి.     భోజనం లో ఆకు కూర‌లు, పప్పులు ఎక్కువ‌గా ఉండేలా  ప్లాన్ చేసుకోండి. రాత్రి భోజ‌నంలో ఫ్రై లు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అదే విధం గా  అన్నం పెద్ద పళ్ళెంలో కాకుండా చిన్న గిన్నెలో  తినడం అలవాటు  చేసుకుంటే , కాస్త త‌క్కువ అన్నం తిన‌డానికి ఈ ట్రిక్  బాగా పనిచేస్తుంది.   స‌న్న‌బడాలి అనుకున్నవారికి   అన్నం   మానేయ‌డం అనేది ఎప్ప‌టికీ  మంచి ప‌రిష్కారం కాదు అని గమనించండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri