NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

నిద్ర రావడం లేదా.. అయితే మీలో ఈ సమస్య ఉన్నట్టే!

అలసిన శరీరానికి విశ్రాంతినివ్వడానికి రాత్రి నిద్ర ఎంతో ఉపయోగపడుతుంది. నేటి సమాజంలో రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టని వారెందరో ఉంటారు. ఎంత ప్రయత్నించినా గాని నిద్రాదేవి దరిచేరని జనాలు పడే బాధ వర్ణించలేనిది. ఈ నిద్ర లేమి కారణంగా అనారోగ్య సమస్యలు ఎన్నో ఎదురవుతుంటాయి. ఈ నిద్రలేమి అనేక కారణాల మూలంగా రావొచ్చు. పని ఒత్తిడి కావొచ్చు, అధిక ఆలోచనా కావొచ్చు….ఇలా అనేక కారణాల వల్ల నిద్ర పట్టకపోవచ్చు. కాని ఏదైనా ఆరోగ్య సమస్య నుంచి రికవరీ కావాలంటే మాత్రం మనిషికి నిద్ర ఎంతో అవసరం. నిద్ర సరిగ్గా పోవడం వల్ల మనిషి ఆ రోజంతా ఎంతో ఆక్టీవ్ గా, కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతాడు. రోజుకు ఒక వ్యక్తి మామూలుగా 8 నుంచి 6 గంటలైనా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 8 గంటకంటే ఎక్కువైనా నిద్రపోవచ్చని తెలుపుతున్నారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిగ్గా 6 గంటలు కూడా నిద్రపోని జనాలున్నారంటే నమ్మరేమో..

అలాగే అనేక రకరకాల స్లీపింగ్ డిసార్డర్స్ మూలంగా కూడా నిద్ర లేకపోవడంతో అది డయాబెటీస్, కార్డియో వాస్క్యులర్ డిసీజెస్, బ్లడ్ ప్రషర్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వంటివి కూడా సంభవించవచ్చు. దీనిలో భాగంగా ఇన్సోమ్నియా, నార్కోలెప్సీ వంటి స్లీపింగ్ డిసార్డర్స్ ని రికగ్నైజ్ చేయడం తేలిక, కాని స్లీప్ యాప్నియా వంటి చాలా మందికి తెలియని వాటిని గుర్తించడం చాలా కష్టమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్లీప్ యాప్నియా అనేది నిద్రకి సంబంధించిన ఒక బ్రీథింగ్ వ్యాధి. దీనివల్ల నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురౌతాయి. అలాగే గొంతులో ఉన్నమజిల్స్ ఓవర్ రిలాక్సేషన్ వల్ల ఇలా జరుగుతుంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ స్లీప్ యాప్నియా వల్ల టిష్యూలకి కావాల్సిన ఆక్సిజన్ లభించదు. దీని వల్ల రాత్రుళ్లు సరైన నిద్ర లేక మార్నింగ్ టైం లో తలపోటు, నీరసం, డిప్రెషన్ వంటివి కూడా కలగవచ్చని అంటున్నారు నిపుణులు.

ప్రధానంగా ఈ స్లీప్ యాప్నియా పేద కుటుంబాల్లో ఉన్న వారికి, ఒక్కరిమీదే కుటుంబం బతుకుతుండే కుటుంబాల్లో ఈ వ్యాధి వస్తుందని తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో కూడా స్లీప్ యాప్నియాకీ డిప్రెషన్ కి మధ్య సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ నిద్ర లేమి సమస్య పెరుగుతునన కొద్ది బ్రెయిన్ సామర్థాన్ని కూడా వినియోగించుకోలేరని తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో ఈ వ్యాధి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇది ఉన్న వారికి ఆలోచనా శక్తి, పనిచేసే సామర్థ్యం తగ్గిపోతూ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్లీప్ యాప్నియా లక్షణాలతో బాధపడే వారు త్వరితగతినా డాక్టర్ ను కలిసి స్లీప్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ లో నిద్రకు ముందు ఒక పరికరాన్ని అమరుస్తారు. ఈ పరికరం ఆక్సిజన్ లెవెల్స్ ని మానిటర్ చేస్తుంది. శ్వాస తీసుకోవడం ఎక్కడైనా కొన్ని సెకన్లు ఆగితే దానిని మానిటర్ చేస్తుంది. సీవియర్ కేసుల్లో కంటిన్యువస్ పాజిటీవ్ ఎయిర్ వే ప్రెషర్(సీపీఏపీ) థెరపీ ఆప్ట్ చేసుకోవచ్చు. ఈ థెరపీ లంగ్స్, అప్పర్ ఎయిర్ వే ప్యాసెజెస్ ను ఓపెన్ గా ఉండటానికి కావాల్సిన గాలిని పీల్చేలా చేస్తుంది. బ్రీతింగ్ మధ్యలో వచ్చే పాజ్ ను ప్రివెంట్ చేస్తుంది. ఫలితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిద్ర పట్టేలా చేస్తుంది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju