Stomach Bug: ప్రస్తుత రోజుల్లో బయట జంక్ ఫుడ్ కి జనాలు బాగా అలవాటు పడి రకరకాల రోగాల పాలవుతున్నారు. ఎక్కువగా కడుపులో ఇన్ఫెక్షన్ కి గురవుతున్నారు. దీనివల్ల కడుపులో పేగులు వాపుకు దారితీస్తున్నాయి. కడుపులో బ్యాక్టీరియా మరియు వైరస్ ల వాళ్ళ కడుపు ఇన్ఫెక్షన్ కి గురై.. ఏమి తీసుకునే పరిస్థితి ఉండదు. ఫిజికల్ గా ఇంక మెంటల్ గా కడుపు ఇన్ఫెక్షన్ ఎంతో బాధిస్తది. తీసుకునే ఆహారంతో పాటు ఒకోసారి ద్రవ పదార్థాల వల్ల కూడా అనగా నీరు రూపంలో కూడా కడుపు ఇన్ఫెక్షన్ కి గురయ్యే పరిస్థితి ఉంటుంది. కడుపు ఇన్ఫెక్షన్ గురైతే… బయటపడే లక్షణాలు చూస్తే వాంతి, నోరు పొడిబరి పోవటం, పొత్తికడుపు నొప్పి రావడం. కడుపు ఇన్ఫెక్షన్ కి గురైతే ఎక్కువ వాంతులు అవుతాయి. తద్వారా లోనున్న వేస్ట్ మొత్తం… నోటి ద్వారా బయటకు కక్కేయటం జరుగుతుంది.

తీవ్రమైన కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు…
- విపరీతమైన చలి లేదా చెమటలు పట్టడం
- చర్మం జిడ్డుగా మారటం
- కీళ్లు బిగుతుగా మారడం లేదా కండరాల నొప్పి
కడుపు ఇన్ఫెక్షన్ ప్రధానంగా సోకే విధానం..
- కలుషితమైన ఆహారం మరియు నీటిని తీసుకోవడం ద్వారా
- పాతబడి పోయిన కలుషితమైన ప్లేట్ లలో తీసుకున్న ఆహార పదార్థాల ద్వారా.
- ఆల్రెడీ వ్యాధి సోకిన వ్యక్తితో ఆహారం పంచుకోవడం ద్వారా.
వ్యాధిని ఎలా నిర్ధారించాలి మరీ తీసుకోవాల్సిన చికిత్స ఏమిటి..?
కడుపు ఇన్ఫెక్షన్ కి గురైంది అని ప్రధానంగా డిహైడ్రేషన్ సంకేతాల ఆధారంగా వైద్య విషయం నిర్ధారించబడుతుంది. వాటిలో ప్రధానంగా చూసుకుంటే
- యూరిన్ టెస్ట్
- బ్లడ్ టెస్ట్
- పొడిబారిన లేదా జగటగా ఉండే నోరు
- అల్ప రక్తపోటు
- అధిక గాడత ఉండే మూత్రం
- కళ్ళు లోతుకు వెళ్ళిపోవటం
- కన్నీళ్లు లేకపోవడం
- బద్ధకం లేదా కోమ..
చికిత్సకి పరిష్కారలు
ఇది ఉన్నప్పుడు కడుపు ఇన్ఫెక్షన్ చికిత్సకి వైద్యుడు సూచించే పరిష్కారాలను రోగి పాటించాలి. రోగికి అతిసారం నిర్వహణకు… గురవుతే. దీంతో వికారం మరియు వాంతులతో సతమతమవుతాడు కనుక ద్రవాలు తీసుకున్న శరీరం సహకరించే పరిస్థితి ఉండదు. అందువల్ల సిరా ద్వారా ద్రవాలను ఎక్కించటం అత్యంత అవసరం. ఇక డిహైడ్రేషన్ కి గురైతే అధిక మోతాదులో ద్రవ పదార్థాలను తీసుకోవడం మానివేయాలి. దానికి బదులుగా చిన్న చిన్న మోతాదులో ద్రవపదార్థాలను తీసుకోవాలి. వికారం మరియు వాంతులు నివారించడానికి భారీ భోజనాన్ని నివారించాలి. ఈ క్రమంలో పెరుగు, అరటి పండ్లు… తాజా ఆపిల్ పళ్ళు.. ఉడకబెట్టిన కూరగాయలు, తృణధాన్యాలు, ఉడకబెట్టిన బంగాళదుంపలు, తక్కువ మోతాదులో మాంసం మరియు రొట్టె వంటి ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా మోతాదులో విరామం తీసుకుంటూ తినటానికి ప్రయత్నించాలి. బాగా విశ్రాంతి తీసుకోవటం ముఖ్యం.