Thyroid: ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా ఇబ్బంది పడే ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి.థైరాయిడ్ సమస్య వలన ఇప్పటికే చాలామంది బాధ పడుతున్నారు.థైరాయిడ్ గ్రంధి అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన హార్మోన్.ఈ హార్మోన్ కణాలను రిపైర్ చేయడంలోనూ, జీవక్రియ ప్రక్రియ సాఫిగా జరగాలన్న థైరాయిడ్ హార్మోన్ అనేది శరీరంలో చాలా ముఖ్య పాత్రను పోహిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ హెచ్చు తగ్గుల వలన ఈ సమస్య వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో మంచి పోషకాలు ఉండేలా చూసుకుంటే ఎటువంటి సమస్య అనేది రాదు.క్రమం తప్పకుండా థైరాయిడ్ కు సంబందించిన మందులు వేసుకుంటే చాలు అని అనుకుంటే పొరపాటు పడినట్లే… ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి ఆహారం కూడా దోహదపడుతుంది. థైరాయిడ్ ఉన్నవాళ్లు తీసుకునే ఆహారం విషయంలో మేము చెప్పే జాగ్రత్తలు పాటిస్తే థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు..
థైరాయిడ్ సమస్య వున్నవాళ్లు ముఖ్యంగా చేయవలిసిన పని ఏంటంటే ఆహారం తినడాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు.అలాగే మినుములతో చేసిన ఆహారాన్ని తింటే చాలా మంచిది.వాటితో పాటు సీజనల్ గా దొరికే పండ్లు, కూరగాయలని తింటూ ఉండాలి.ఆకుకూరలు పాల కూర తినడం కూడా మంచిది. వీరు తులసి ఆకులతో తయారుచేసిన టీ తీసుకోవడం మంచిది.బ్రౌన్ రైస్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. థైరాయిడ్ బాధపడేవారు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది.ప్రతిరోజు శ్వాస వ్యాయాయం చేయడం,యోగ చేయడం చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ మందులు వాడాలి.
థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు సొయాబీన్స్,అవిసె గింజలు తినడం తగ్గించాలి.ఎందుకంటే సోయాబీన్స్ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది.అలాగే టీ, కాఫీ వంటి కెఫిన్ వంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి.ఇది థైరాయిడ్ గ్రందిని ప్రభావితం చేసి రక్తంలో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ను పెంచుతాయి.అలాగే క్యాలీ ఫ్లవర్, బ్రకోలి,క్యాబేజి వంటి వాటిని తినడం తగ్గించాలి.రెడ్ మీట్ ను కూడా తినకుండా ఉంటే మంచిది.థైరాయిడిజం తో బాధపడే వారు సగం ఉడికించిన ఆకుకూరల ని అస్సలు తీసుకోకూడదు.చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను అస్సలు తీసుకోకూడదు.ఎప్పటికప్పుడు ఇంట్లో చేసిన తాజా అహరాన్ని తినాలి తప్పా బయట దొరికే ప్రాసెసింగ్ ఫుడ్ ను అసలు తినకూడదు.అలాగే నూనెలో డీప్ ఫ్రై చేసిన ఫుడ్, జంక్ ఫుడ్ జోలికి అసలు వెళ్ళకూడదు.మద్యపానం, దూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…