Sunscreen for Oily Skin: సన్ స్క్రీన్ లోషన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసా? ఎండాకాలం వొచ్చిందంటే ఎన్నో కష్టాలు…అందులో ఒకటి స్కిన్ ట్యానింగ్ ఇది ముఖ్యంగా ఆడవారిని ఎండాకాలం బయటకి వెళ్లకుండా చేస్తుంది. అవును మరి, సంవత్సరం మొత్తం కాపాడుకున్న చర్మ నిగారింపు ఒక్కరోజు వేసవి ఎండలో తిరిగితే చాలు అంతే సన్ టాన్ వల్ల కాంతివంతమైన చర్మం ఎండిపోయినట్టు అవుతుంది. అయితే ఇది సూర్యుడి వేడి వలన జరగదు… సూర్య కిరణాలలో ఉండే యూవీ రేస్ అంటే అల్ట్రా వొయిలెట్ రేస్ వల్ల జరుగుతుంది. ప్రత్యేకంగ ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఇది ఇంకా పెద్ద తలనొప్పిగా మారుతుంది. అలంటి ఆయిలీ స్కిన్ ఉన్నవారికి వేసవి కలంలో ఎలాంటి సన్ స్క్రీన్ వాడి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

సన్ స్క్రీన్ లోషన్స్ ఎలా పనిచేస్తాయి?
మన చర్మం మీద సూర్యకాంతి పాడినప్పుడు చాలావరకు ఆ కాంతిని మన చర్మం గ్రహించుకుంటుంది…అయితే ఆ కాంతిలో హానికరమైన యూవీ కిరణాలు ఉంటాయి. ఇలాంటి హానికరమైన కిరణాలనుండి మనల్ని కాపాడటానికి చర్మం పిగ్మెంటేషన్ అనే పద్దతి ధ్వారా పిగ్మెంట్ విడుదల చేసి చర్మానికి సంబందించిన కాన్సర్ లాంటి వ్యాధులనుండి మనల్ని కాపాడుతుంది. చాలా వరకు మార్కెట్లో దొరికే సన్ స్క్రీన్ లోషన్స్ ఎమ్ చేస్తాయి అంటే చర్మం మీద పడే యూవీ లాంటి హానికరమైన కిరణాలను చర్మం గ్రహించకుండా రిఫ్లెక్ట్ చేస్తాయి దీని వలన మన చర్మం పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది…అంతే కాదు యూవీ వలన జరిగే సన్ బర్న్ కూడా ఇలాంటి లోషన్స్ నివారిస్తాయి.
Chematakayalu: చెమటకాయల నుంచి తక్షణ ఉపశమనం అందించే పాక్స్, జాగ్రత్తలు ఇదిగో..
సాధారణ స్కిన్ VS ఆయిలీ స్కిన్
వేసవి కాలంలో ఆయిలీ స్కిన్ ఉన్నవారికి సాధారణ చర్మం ఉన్నవారికంటే ఎక్కువ కష్టాలు ఉంటాయి. ఇదే ఆయిలీ స్కిన్ ఉన్నవారికి శీతల కాలంలో మిగతావారికంటే తక్కువ సమస్యలు ఉంటాయి… ప్రకృతి అలా పనిచేస్తుంది మరి. అయితే వేసవికాలంలో జిడ్డుగల చర్మం ఉన్నవారికి ఇంకా ఎక్కువ జిడ్డు ఉత్పత్తి అవుతుంది. దీని వలన వీరికి స్పెషల్ స్కిన్ ప్రొడక్ట్స్ అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఫేస్ వాష్ వాడే అప్పుడు ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ కొనాల్సి వొస్తుంది, ఇలా చేయటం వలన మొటిమలు లాంటి సమస్యలు రాకుండా నివారించుకోవొచ్చు. అంతే జిడ్డుగల చర్మం ఉన్నవారు ప్రత్యేక సన్ స్క్రీన్ వాడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాంటి చర్మం ఉన్నవారు జిడ్డు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అందువలన సాధారణ సన్ స్క్రీన్ చర్మం మీద నిలబడదు. మరి వీరు ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్ వాడాలి?
సన్ స్క్రీన్ లోషన్ విత్ మాట్టే
వేసవిలో జిడ్డుగల చర్మం ఉన్నవారు ప్రత్యేకమైన సన్ స్క్రీన్ లోషన్ వాడాలి అని అర్ధం చేసుకున్నాం. మరి ఎలాంటి సన్ స్క్రీన్ అనే ప్రశ్నకు సమాధానం మాట్టే సన్ స్క్రీన్ లోషన్. ఏ సన్ స్క్రీన్ లోషన్ లో అయినా మాట్టే లాంటి పదార్ధాలు ఉంటె చాలు. ఇలాంటి సన్ స్క్రీన్ లోషన్స్ చర్మం మీద చమట గ్రంధుల/ రంద్రాలను మూసివేస్తాయి…దీనివలన చెమట మరియు దానికి అనుసంధానం అయిన జిడ్డును పూర్తిగా తగ్గించేస్తాయి. ఇలాంటి సన్ స్క్రీన్స్ వాడితే ఆయిలీ స్కిన్ ఉన్నవారు కూడా ఎంచక్కా సమ్మర్ లో కూడా ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఎండలో తిరగొచ్చు. లక్మే, లోటస్ హెర్బల్, ఆఖ్వాలాజిక, డాట్&కీ, వావ్ స్కిన్, మినిమలిస్ట్, ఇలాంటి ప్రముఖ బ్రాండ్స్ అన్నీ సన్ స్క్రీన్ ఫర్ ఆయిలీ స్కిన్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాయి…మీకు ఏది నచ్చుతుందో చూసి ఎంచుకోండి.