ఫుడ్ పాయిజనింగ్ తర్వాత..

Share

కలుషితాహారం తిని అనారోగ్యోం పాలయిన వారు తేరుకున్న తర్వాత ఏం తినాలన్న ప్రశ్న ఉదయిస్తుంది. కలుషితాహారం లోపలకు వెళ్లిన కారణంగా వాంతులు విరోచనాలు అవుతాయి. కళ్లు తిరుగుతాయి. తలనొప్పి వస్తుంది. కడుపులో మెలిపెట్టినట్లవుతుంది. కొన్ని సందర్భాలలో జ్వరం కూడా రావచ్చు.

కోలుకున్న తర్వాత శక్తి నిచ్చే ఆహారం తీసుకోవాలనుకుంటారు. అయితే ఏది పడితే అది తినలేరు. కారణం ఏమంటే వాంతి వచ్చేట్లుందన్న భావన అంత తొందరగా పోదు. అందుకని చప్పిడి ఆహారం తినాలి. అది సులభంగా అరిగేటట్లు ఉండాలి. దీనికి డాక్టర్లు ‘బ్రాట్’ ఆహారం సూచిస్తున్నారు. బ్రాట్ (BRAT) అంటే (B) బనానా, (R) రైస్, (A) యాపిల్ సాస్, (T) టోస్ట్.

ఈ నాలుగు రకాల ఆహారం చప్పిడిగా ఉంటుంది. వెగటు కలిగించదు. వీటిలో అరటి పళ్లలో పొటాసియం ఎక్కువ కాబట్టి విరోచనాల ద్వారా జరిగిన సూష్మపోషక పదార్ధాల నష్టం భర్తీ అవుతుంది. స్వచ్ఛంగా ఉండే సూపులు, ఓట్‌మీల్, ఉడకబెట్టిన బంగళాదుంప కూడా తీసుకోవచ్చు. ఈ తరహా ఆహారాలను ఇబ్బంది లేకుండా భుజించగలిగితే ఒకటి రెండు రోజుల్లో ఎప్పటి లాగా ఆహారం తీసుకోవచ్చు.

కలుషితాహారం బారిన పడి కోలుకున్న తర్వాత వెంటనే కాఫీ, టీ, పాలు, సోడాల వంటి పానీయాలు తీసుకోకూడదు. విరోచనాల వల్ల సూష్మ పోషక పదార్ధాలు తగ్గి ఉంటాయి కాబట్టి వాటి భర్తీకి కావాల్సిన పానీయాలు తీసుకోవాలి. వేయించిన చికెన్, బంగళాదుంపలు, మసాలా ఆహారాలు తినకూడదు.

కలుషితాహారం వల్ల స్వల్ప ఆనారోగ్యానికి గురయిన పక్షంలో వైద్యుడి దగ్గరకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. మరి వైద్యుడి దగ్గరకు ఎప్పుడు వెళ్లాలి?

విరోచనంలో రక్తం ఛాయలు కనబడినా, విరోచనం కాఫీ రంగులో ఉన్నా,

మూత్ర విసర్జన తగ్గిపోవడం, నోరు ఎండి పోవడం వంటి డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించినా,

101.5 ఫారనహీట్ డిగ్రీలకు మించి జ్వరం వచ్చినా,

మూడు రోజులకు కూడా విరోచనాలు తగ్గకపోయినా,

పానీయాలు కడుపులో ఇమడనంతగా వాంతులు అవుతున్నా,

వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.


Share

Related posts

Pet Dog : కుక్క నాకితే ఏమైందో తెలుసా.. వింటే షాక్ అవ్వాల్సిందే..!!

bharani jella

ఎర్రని ద్రాక్ష మీకున్న ఆ సమస్య కి పరిష్కారం!!

Kumar

‘బెల్లం టీ’తో ఎంత ఆరోగ్యమో తెలుసా?

Teja

Leave a Comment