Romance: స్త్రీ ఓ బిడ్డను కన్న తర్వాత మానసికంగా, శారీరకంగా, ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆమె కి పుట్టిన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం లోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది. అందువలన ఇంతకు ముందు లా శృంగారం మీద ఆసక్తి చూపలేదు. కానీ మగవారికి మాత్రం కామోద్రేకం పొంగుకొస్తుంటుంది. అటువంటి సమయంలో భర్తతో శృంగారం చేయక తప్పని పరిస్థితి. అయితే ఆ సమయంలో శృంగారంలో శృతి మించి పోకుండా, నెమ్మదిగా పని పూర్తి చేసుకోవడం మంచిది. అలా నెమ్మది గా చేయటం వలన డెలివరీ అయిన స్త్రీ కి నొప్పి ఉండదు కాబట్టి ఆనందం పొందుతుంది.
అదే దూకుడు గా వ్యవహరిస్తే మాత్రం పురుడు నొప్పులు మరింత బాధిస్తాయి. కాబట్టి నొప్పులు తగ్గుముఖం పట్టే వరకు డాక్టర్ సలహా తో శృంగార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.ఒకవేళ స్త్రీ కి నొప్పులు తగ్గడానికి ఎక్కువ సమయం పట్టినప్పుడు, భర్త శృంగారం కోసం ప్రేరేపిస్తే, అప్పుడు ఎలాంటి సందేహం లేకుండా వారితో ఆ బాధను పంచుకోవాలి. అప్పుడు వారు కచ్చితంగా అర్థం చేసుకుంటారు. డెలివరీ తర్వాత శృంగారం చేసేటప్పుడు నెమ్మది గా చేద్దాం అని మొదలు పెట్టి.. మొదలు పెట్టిన తర్వాత ఎక్కువ ఉద్రేకం తో ఎలా పడితే అలా రెచ్చి పోకుండా నెమ్మదిగా ముగించేలా ప్రయత్నించాలి.
బిడ్డ పుట్టిన తర్వాత స్త్రీ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. శరీరం లావెక్కి, వక్షోజాలు బిగుతు కాస్త తగ్గడం వంటివి జరుగుతాయి. ఈ కారణంగా స్త్రీలలో శృంగార కోరికలు తగ్గుతాయి. అయితే భర్తలో రగులుతున్న శృంగార కోరికలు తీర్చాలంటే మాత్రం భార్య సహనంతో అంగీకరించి అతనిని సంతోషపెట్టి, తాను కూడా తృప్తి చెందవచ్చు. స్త్రీ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తగినంత పోషకాహారం తీసుకుని ఆరోగ్యం కాపాడుకుంటూ, సరిపడినంత విశ్రాంతి, నిద్ర ఉంటే ఆమెలో శృంగార పరమైన కోరికలు తిరిగి మొదలవుతాయి. బిడ్డ పుట్టిన తర్వాత స్త్రీ తన భర్త తో రతిలో పాల్గొన లేకపోయినా వారితో కొద్దీ సేపు ఏకాంతంగా గడిపేలా సమయాన్ని పెట్టుకోవాలి. దీంతో ఇద్దరు మరింత దగ్గర అవుతారు. మీ బంధం స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు అలా ప్రేమ పూరితమైన సమయం మీ వారికి ఇవ్వగలిగితే ఆయన కచ్చితంగా మీకు అండగా నిలుస్తారు.