NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

డయాబెటిస్ ఉన్నవారు యాపిల్స్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Share

మ‌నం తినే వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండ్ల‌లో ఆపిల్స్ ఒక‌టి. ఇవి చూడ‌టానికి ప్ర‌కాశ‌వంతంగా, లేత ఎరుపురంగులో ఉంటాయ‌ని వాటికి ఆ ప్ర‌త్యేక గుర్తింపు రాలేదు. వాటిలో ఉండే అనేక ర‌కాల పోష‌కాలు, రుచిక‌ర‌మైన తియ్య‌ని, జ్యూసీ స‌హజ స్వ‌భావ‌మే వాటిని అంత‌లా ప్ర‌త్యేక‌త‌ను సంపాదించిపెట్టాయి.

86 శాతం నీటితో త‌యారైవున్న ఆపిల్ పండ్ల‌ల్లో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన కాల్షియం, మెగ్నిషియం, పాస్ప‌ర‌స్‌, పోటాషియం వంటి వివిధ ర‌కాలైన ఖ‌నిజాలు ఉంటాయి. త‌క్కువ మొత్తంలో కొవ్వు ప‌ద‌ర్థాల‌ను క‌లిగిన ఆపిల్ పండ్ల‌లో విట‌మిన్ ఏ, సీ, కే లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. అయితే, ఇన్ని లాభాల‌ను చేకూర్చే ఆపింల్ పండ్ల‌ను షుగ‌ర్ పేషెంట్లు తిన‌వ‌చ్చా? అస‌లు తింటే ఏం జ‌రుగుందో ఇప్పుడు తెలుసుకుందాం!

ఆపిల్ పండ్ల సాధార‌ణ వినియోగం ద్వారా డ‌యాబెటీస్ ప్ర‌మాదాన్ని 18 శాతం వ‌ర‌కూ త‌గ్గిస్తుంద‌ని ఇటీవ‌ల జ‌రిపిన ఓ అధ్య‌య‌నం ద్వారా వెల్ల‌డైంది. ఆపిల్ పండ్లు అధిక ప్ర‌భావం క‌లిగిన యాంటీ యాక్సిడెంట‌ల్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగివుంటాయి. దీని కార‌ణంగా క్లోమంలో బీటా క‌ణాల ప‌నితీరును మెరుగుప‌రిచి, స‌రైన స్థాయిలో ఇన్సులిన్ ఉత్ప‌త్తి అవుతుంది. ర‌క్తంలో గ్లూకోజ్ స్థ‌యి స‌రైన ప‌రిమాణంలో ఉంటుంది. టైప్‌-2 డ‌యాబెటీస్ దారి తీసే ప్ర‌మాదాన్ని సైతం ఆపిల్స్ త‌గ్గిస్తాయి.

అలాగే, బ‌రువు త‌గ్గ‌టంలోనూ ఆపిల్ప్ ప్ర‌భావంతంగా ఉంటాయి. స్థూల‌కాయం బారిన‌పడ‌కుండా కాపాడాతాయి. ఓ పరిశోధన ప్రకారం.. ఆపిల్ తొక్కలో ఉండే పాలీఫినాల్స్ కడుపులో మంటను నివారించేందుకు సహాయపడతాయి. ఆపిల్ పండ్లు విటమిన్ సీ, పాలీఫినాల్స్‌ లను సమృద్ధిగా కలిగిఉంటాయి, అవి యాంటి ఆక్సిడంట్ లక్షణాలను కలిగిఉంటాయి. ఈ సమ్మేళనాలు వృద్దాప్య ల‌క్ష‌ణాలు త్వ‌ర‌గా రాకుండా ఆపుతాయి. అలాగే, చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కుండా ఉండ‌టంలో స‌హాయ‌ప‌డతాయి.

ఆపిల్ లో ఉండే ఆంటియాక్సిడెంట్స్ కాన్సర్ వ‌ల్ల క‌లిగే మ‌ర‌ణ రేటును త‌గ్గిస్తాయ‌ని ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయి. ఆపిల్ తిన‌డం ద్వారా ఎముక‌ల సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది. అలాగే, మెద‌డు ప‌నితీరుపై కూడా ప్ర‌భావం చూపుతుంది. మ‌రీ ముఖ్యంగా ముస‌లిత‌నంలో మ‌తిమ‌రుపు రాకుండా.. జ్ఞాపక శక్తి పెరుగుద‌ల‌కు ఆపిల్స్ దోహదం చేస్తాయి.


Share

Related posts

పూరీ- విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ అదుర్స్..!!

sekhar

Aadhar: ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్…!

bharani jella

Hyper Aadhi: ఆ డైరెక్టర్ సినిమాలు ఎక్కువ చూస్తాను..ఆయన ఎక్కువగా ప్రభావితం చేస్తారంటున్న హైపర్ ఆది..!!

sekhar