తెల్ల వెంట్రుకలు ఈ మాట వింటే చాలు, చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు . కొన్ని వేల వెంట్రుకలలో ఒక్క తెల్ల వెంట్రుక వచ్చిన చాలు ,తలాపట్టుకుని కూర్చుంటారు.
ఆ వెంట్రుకని పీకే దాకా మనశ్శాంతి ఉండదు.ప్రస్తుతసమాజంలో ఈ సమస్య చాలా మందిలో ఉంది. తలలోఉన్న ఒక్క వెంట్రుక బలవంతంగా అక్కడినుండి తీసివేస్తే మరిన్ని తెల్లవెంట్రుకలు మొలుస్తాయని చాలా మంది అపోహ పడుతుంటారు.మెలనిన్ అని పిలువబడే హార్మోన్ జుట్టు రంగును కోల్పోవడం ,గ్రెకలర్ జుట్టుకు కారణం అవుతుంది.చర్మం రంగు ,జుట్టు రంగుకు ప్రధాన కారణం మెలనిన్ ఉత్పత్తి .మెలనిన్ కోల్పోవడం అనేది సహజం గా 30 ఏళ్ళు పైబడిన వారిలో జరుగుతుంది . జుట్టు రంగు కోల్పోయే రేటు జన్యువులో దాగి ఉంటుంది . మీ తల్లిదండ్రులకు చిన్న వయస్సులోనే మెలనిన్ లోపం ఉంటె , మీకు గ్రే కలర్ జుట్టు వచ్చే అవకాశం ఉంది .మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, సమతుల్య ఆహారం అవసరం.మీ జుట్టు కొన్ని పోషకాలను కోల్పోయినప్పుడు, జుట్టురాలడం జరుగుతుంది.విటమిన్ బి12, ఫోలేట్,రాగి, ఇనుము,మొదలైన విటమిన్లు పెంచే మాత్రలు తీసుకోవడం వల్ల ,జుట్టు కాలక్రమేణా దాని సహజ రంగుని తిరిగి పొందుతుంది.కానీ ఈ మాత్రలు తీసుకునే ముందు డాక్టర్ సలహాలు తీసుకోవటం మంచిది. పోషకాహార లోపం మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
బంగాళాదుంప చర్మములో ఉండే నేచురల్ పిండిపదార్థాలు జుట్టును నల్లగా మారుస్తుందని నమ్ముతారు.కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.మరియు మీరు ఈ మాస్క్ వేసుకోవటం ఆపితే, ఫలితం ఏమిఉండదు.మళ్ళి జుట్టు యధావిధిగా అవుతుంది.