White spots on nails: కొంత మంది చేతి వేళ్ల గోళ్ల పై సహజంగానే తెల్లని మచ్చలు వస్తుంటాయి. అయితే కొందరికి ఎక్కువగా ఉంటాయి. కొందరి వేళ్లపై మచ్చలు చిన్నగానే ఉన్నా మరి కొందరికి మాత్రం వెడల్పుగా కబడుతుంటాయి. అయితే ఇలా ఎందుకు వస్తుంటాయి అని భయపడుతుంటారు. ఈ మచ్చలు ఎందుకు వస్తుంటాయి, ఆ సమస్య ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్య పరిభాషలో ఈ స్థితిని లుకోనైకియా అంటారు. ఇది అత్యంత సహజసిద్ధమైనది. అయితే కొన్ని ఆనారోగ్య సమస్యల వల్ల కూడా చేతి వేళ్ల గోళ్లపై అలా తెల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. గోళ్ల పై మచ్చలు ఏర్పడేందుకు అనేక కారణాలు చెబుతుంటారు. నెయిల్ పెయింట్ లను ఎక్కువగా వాడే వారికి ఆలా మచ్చలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. గోళ్లకు దెబ్బలు తిగిలినా, ఫంగస్ ఇన్ ఫెక్షన్లు వచ్చినా అలా గోళ్లపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. నెయిల్ పాలిష్ లు కొందరికి పడవు. అలర్జీని కలిగిస్తాయి. అలాంటి వారి గోర్లపై కూడా మచ్చలు ఏర్పడుతుంటాయి. జింక్ లేదా కాల్షియం లోపం ఉన్నా కూడా ఆ మచ్చలు వస్తుంటాయి. జింక్, కాల్షియం ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే ఆ మచ్చలు పోతాయి.
గుండె జబ్బులు ఉన్న వారికి, నోటి దుర్వాసన, కిడ్నీ ఫెయిల్యూర్, సొరియాసిస్, ఎగ్జిమా, న్యూమోనియా వంటి వ్యాధులు ఉన్న వారికి కూడా మచ్చలు వస్తాయి. ఆర్సెనిక్ పాయిజనింగ్ అయినా అలా గోళ్లపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. అయితే మచ్చలు మరీ పెద్దగా, ఎక్కువ సంఖ్యలో ఏర్పడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. అవసరం అయితే మందులు వాడాలి. ప్రారంభంలోనే వైద్యులకు చూపించుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.