కోడిగుడ్ల ద్వారా మనకు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటిల్లో శరీరానికి కావల్సిన శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం వంటి కీలక పోషకాలు ఉంటాయి.
వీటితో మనకు పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భ్రమను మనం చాలా కాలంగా వింటున్నాం. కానీ వాస్తవానికి, ఆహారం నుండి పొందిన కొలెస్ట్రాల్‌కు శరీరానికి సంబంధించిన కొలెస్ట్రాల్‌తో సంబంధం లేదు. కాబట్టి గుడ్డులో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, అది మన శరీరం ఉత్పత్తి చేసే కొలెస్ట్రాల్ స్థాయిని పెంచదు. మీ కొలెస్ట్రాల్ స్థాయి ఇప్పటికే ఎక్కువగా ఉంటే, మీరు పెద్ద మొత్తంలో గుడ్లు తినకూడదు.
గుడ్డులోని పచ్చసోనలో శరీర సౌష్టవాన్ని కాపాడే విటమిన్-డి, అనవసరమైన కొవ్వును కరిగించే కోలిన్ అనే ధాతువు, సెలీనియం, బి12 పుష్కలంగా ఉంటాయి. వారానికి కనీసం మూడు నుండి ఐదు సార్లు రెండు గుడ్ల చొప్పున ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఊబకాయం తగ్గుతుందని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
బరువు తగ్గాలి అనుకునేవారు బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు తీసుకోవడం వలన చాల తేలికగా బరువు తగ్గవచ్చు. బ్రేక్ ఫాస్ట్ గా గుడ్లు తీసుకునేవారు చాలా చురుకుగా ఉంటారు. రోజంతా బరువు తగ్గడానికి గుడ్డు సహాయపడుతుంది. బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు తీసుకున్నవారు ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని ఇష్టపడకుండా ఉండడాన్ని గుర్తించారు.
ఆహారంలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల,బరువు తగ్గడం సులభం.అందుకే బరువును తగ్గించుకునేందుకు గుడ్డు ఉపయోగపడుతుంది. అందులోగుడ్డులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తినగానే కడుపు నిండిపోతుంది.కాబట్టి ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు… అందువల్ల తక్కువ ఆహారం తీసుకొని బరువును అదుపు చేసుకోగలుగుతారు. గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది .అందుకే డైటింగ్‌లో ఉన్నవారుతప్పకుండ గుడ్డును తీసుకోవాలి.