Face pack:అందంగా ఉండాలని ఎవరు మాత్రం అనుకోరు చెప్పండి. ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చల కారణంగా ఒక్కోసారి మన ముఖం అందవిహీనంగా తయారు అవుతుంది.ఆ మచ్చలను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను ఉపయోగిస్తూ ఉంటాము.. అయితే వాటిలో కలిపే రసాయనాల వలన ముఖం మరింత పాడవుతుంది. అలాంటి వాటితో పనిలేకుండా ఎంచక్కా మన ఇంట్లో దొరికే సహజమైన పదార్ధాలతోనే పేస్ ప్యాక్స్ వేసుకుని ముఖం మీద ఏర్పడిన నల్లటి మచ్చలను తొలగించుకోవచ్చు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరి ఆ పేస్ ప్యాక్స్ ఎలా తయారుచేయాలో చూద్దామా..తాజాగా ఉన్నా క్యారెట్, నిమ్మకాయ, బంగాళాదుంపను ఒక్కొక్కటిగా తీసుకుని శుభ్రంగా కడిగి పక్కనబెట్టుకోవాలి. తరువాత వీటి పైన ఉన్న తొక్క తీయకుండా అలానే తురుముకోవాలి.ఇలా తీసిన తురుమును ఒక 24 గంటల పాటు అలానే స్టోర్ చేయాలి. మరుసటి రోజు తురుమును వడగొట్టి నీరును వేరు చేయాలి. మరొక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్స్ అలొవిరా జెల్ తీసుకువాలి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అందులోనే ముందుగా వడగొట్టుకున్న క్యారెట్, నిమ్మ, బంగాళాదుంప రసాన్ని ఒక మూడు స్పూన్స్ తీసుకుని అలొవిరా జెల్ లో కలపాలి.తరువాత ఇందులోనే ఒక చెంచా బాదాం నూనె కూడా వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి.చివరగా ఈ విటమిన్ క్యాప్యూల్స్ కూడా వేసుకుని క్రీమ్ లాగా తయారుచేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఒక గాలి చొరబడని సీసాలో వేసి ముతపెట్టుకుని ఉంచుకోవాలి.ఈ మిశ్రమాన్ని వారానికి రెండు., మూడు సార్లు తీసుకుని ముఖానికి రాసుకుంటే ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలు పోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.